Share News

Yelavarthy Nayudamma: శాస్త్రీయ దృక్పథంతో మానవీయ సమాజం

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:14 AM

ఆంధ్రప్రదేళ్‌లోని తెనాలి దగ్గర యలవర్రు గ్రామంలో 1922 సెప్టెంబరు 10న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన యలవర్తి నాయుడమ్మ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన...

Yelavarthy Nayudamma: శాస్త్రీయ దృక్పథంతో మానవీయ సమాజం

ఆంధ్రప్రదేళ్‌లోని తెనాలి దగ్గర యలవర్రు గ్రామంలో 1922 సెప్టెంబరు 10న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన యలవర్తి నాయుడమ్మ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన మేధావి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చి సంస్థ అత్యున్నత (డైరక్టరు జనరల్) పదవి నిర్వహించారు. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి, 1985 జూన్ 23న మరణించేదాకా నిత్య పరిశోధకుడిగానే జీవించారు.

సామాజిక విషయాలలో కూడా శాస్త్రీయ అభినివేశాన్ని ప్రదర్శించటం నాయుడమ్మ ఆశయం. మూఢవిశ్వాసాల్నీ ముహూర్త బలాల్నీ వీడి, హేతుబద్ధమైన ఆలోచనతో కూడిన మనిషి చైతన్యమూ, వ్యక్తిత్వమూ వికసించే మానవీయ సమాజం వైపు జాతి జనుల అడుగులు పడాలనేది ఆయన ఆశ, ఆదర్శం కూడా! దేశమంతా విద్యారంగం, ఇతర మార్గాల ద్వారా శాస్త్రీయ అభినివేశం (సైంటిఫిక్ టెంపర్) లోతుగా విస్తరించాలని ఆయన తపించారు. హేతుబద్ధ చింతన, శాస్త్రీయ వివేచనా, నిరంతర అధ్యయనం, నిత్య పరిశోధనా... ఆయన జీవధాతువులు. మూఢ విశ్వాసాలను ఖండించటం, కాలం చెల్లిన భావాలను తిరస్కరించటం ఆయన వ్యక్తిత్వంలో, జీవిత ఆచరణలో ఒక భాగం.

కుల–మతతత్త్వాలు, దోపిడీ–దౌర్జన్యం, ఆభిజాత్యం, జాతి విద్వేషం... మొదలైన సామాజిక రుగ్మతలను మనంగా అర్థం చేసుకుని పరిష్కరించుకోవాల్సి ఉండగా – మన జీవన కష్ట నిష్టురాలన్నిటికీ పుట్టుక సమయం నాటి గ్రహగతులూ, కుజదోషాలూ అంటూ మనిషినీ, సమాజాన్నీ దేవుడు, కర్మ, గ్రహబలం పేరిట పరాధీనాలుగా మార్చివేస్తున్న ఈనాటి కొందరి భక్తి పరిశ్రమాధిపతుల విధానాలను మనం ప్రశ్నిస్తున్నామా? నాయుడమ్మయితే ఇటువంటి సమయంలో ఏం చేసేవారో ఆలోచించామా? సామాజిక సమస్యలను సమాజంలోనే నిలవేసి, ప్రశ్నించి తర్కించి ఒక జవాబుని రాబట్టాలి. అదీ నాయుడమ్మ పద్ధతి. శాస్త్రీయ అభినివేశానికి పట్టంగట్టటమే నాయుడమ్మకి నిజమైన నివాళి.

దివి కుమార్, జనసాహితి

(నేడు తెనాలి రామకృష్ణ కవి సభా మందిరంలో

నాయుడమ్మ 103వ జయంతి పురస్కార సభ)

ఈ వార్తలు కూడా చదవండి..

యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్

ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

For More AP News And Telugu News

Updated Date - Sep 10 , 2025 | 01:14 AM