Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 7 07 2025

ABN , Publish Date - Jul 07 , 2025 | 05:35 AM

దాశరథి శతజయంతి సదస్సు, కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డులు, రజనిశ్రీ సాహిత్య పురస్కార ప్రదానం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 7 07 2025

దాశరథి శతజయంతి సదస్సు

కేంద్రసాహిత్య అకాడమీ, తెలుగు శాఖ ప్రభుత్వ సిటీ కళాశాల (హైదరాబాద్) సంయుక్త నిర్వహణలో జూలై 9 ఉ.10 నుంచి సా.5.30 వరకు సిటీ కళాశాల ఆజామ్ హాల్లో ‘దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి సదస్సు’ జరుగుతుంది. ప్రారంభ సమావేశంలో సి. మృణాళిని స్వాగతోపన్యాసం, నందిని సిధారెడ్డి కీలకోపన్యాసం చేస్తారు. ముఖ్య అతిథి ప్రిన్సిపాల్ పి. బాలభాస్కర్, గౌరవ అతిథి దాశరథి కుమార్తె ఇందిరా గౌరీశంకర్, అధ్యక్షత కోయి కోటేశ్వరరావు. పత్ర సమర్పణ– గండ్ర లక్ష్మణ రావు, ఏనుగు నరసింహారెడ్డి, ఆర్. సీతారామ్, కె. ప్రభాకర్, సిద్ధంకి యాదగిరి, సమ్మెట విజయ, గరిపెల్లి అశోక్.

కోయి కోటేశ్వరరావు

కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డులు

కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం అవార్డుల ప్రదానం జూలై 13 ఉ.10.30 గం.లకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్, హైదరాబాద్‌లో జరుగుతుంది. 2025కు గాను కార్టూనిస్ట్ మృత్యుంజయ, ఆర్టిస్ట్ చిత్ర ఈ అవార్డు కింద రూ.10,116 నగదు, ప్రశంసాపత్రం స్వీకరిస్తారు. ముఖ్యఅతిథి ఎస్. వినయకుమార్; స్మారకోపన్యాసం కూర్మనాథ్; విశిష్ట అతిథులు తిప్పర్తి యాదయ్య, చింతల యాదగిరి, శంకర్, కూరెళ్ళ శ్రీనివాస్ తదితరులు వివరాలకు: 9052116323.

కంభాలపల్లి కృష్ణ

రజనిశ్రీ సాహిత్య పురస్కార ప్రదానం

రజనిశ్రీ సాహిత్య పురస్కార ప్రదానం జూలై 12 మ.1.30గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ‘నిశాచరుడి దివాస్వప్నం’ కవితా సంపుటికి గాను మల్లారెడ్డి మురళీమోహన్ పురస్కారాన్ని స్వీకరిస్తారు. కార్యక్రమంలో సి. పార్థసారథి, కసిరెడ్డి వెంకటరెడ్డి, మామిడి హరికృష్ణ, ఎస్. రఘు, అన్నవరం దేవేందర్ తదితరులు పాల్గొంటారు.

గాజుల రవీందర్

ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు

మదుపరులూ పారాహుషార్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jul 07 , 2025 | 05:35 AM