Share News

Literary Events in Hyderabad: ఈ వారం వివిధ కార్యక్రమాలు 22 09 2025

ABN , Publish Date - Sep 22 , 2025 | 02:33 AM

‘నేను మరణిస్తూనే ఉన్నాను’ కవిత్వ పరిచయ సభ, అలాయిబలాయి కవిసమ్మేళనం, మంటో జీవితం – రచనలు, ‘నల్ల పద్యం’ కవిత్వ పరిచయ సభ...

Literary Events in Hyderabad: ఈ వారం వివిధ కార్యక్రమాలు 22 09 2025

‘నేను మరణిస్తూనే ఉన్నాను’ కవిత్వ పరిచయ సభ

బిల్ల మహేందర్‌ కవిత్వ సంపుటి ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ పరిచయ సభ సెప్టెంబర్‌ 23 సా.4 గంటలకు రవీంద్రభారతి హైదరాబాద్‌లో జరుగుతుంది. నామోజు బాలా చారి, నెల్లుట్ల రమాదేవి, యాకూబ్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌, సామిడి జగన్‌ రెడ్డి పాల్గొంటారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ

అలాయిబలాయి కవిసమ్మేళనం

సెప్టెంబర్‌ 26 ఉదయం 9.30 నుంచి సా.5 గం.ల దాకా వరంగల్‌ జిల్లా తొర్రూరు దగ్గరలో అన్నారం యాకన్న (యా కూబ్‌ షా వలీ) దర్గా వద్ద అలాయిబలాయి కవిసమ్మేళనం జరుగుతుంది. గోరటి వెంకన్న, జి. లక్ష్మీనరసయ్య, ప్రసేన్‌, కవి యాకూబ్‌, జూపాక సుభద్ర, సిద్ధార్థ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొంటారు. వివరాలకు: 94404 27968.

వడ్లకొండ దయాకర్

మంటో జీవితం – రచనలు

ఫాసిజం సందర్భంలో మంటో జీవితం – రచనలు జూమ్‌ మీటింగ్‌ సెప్టెంబరు 27సా.6 గం.లకు జరుగుతుంది. పంజాబీ రచయిత పవన్‌ టిబ్బా, పూర్ణిమ తమ్మిరెడ్డి, ఉదయమిత్ర, స్కైబాబ, విప్లవ శ్రీనిధి, హాథీరాం సబావట్‌, పేర్ల రాము, లావణ్య, మెర్సీ మార్గరెట్‌, నరేష్కుమార్‌ సూఫీ పాల్గొంటారు.

సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరమ్‌

‘నల్ల పద్యం’ కవిత్వ పరిచయ సభ

పిన్నంశెట్టి కిషన్ రాసిన ‘నల్ల పద్యం’ కవితా సంపుటి పుస్తక పరిచయ సభ సెప్టెంబర్‌ 28ఉ.10 గంటలకు కరీంనగర్ ఫిలిం భవన్‌లో తెలంగాణ రచయితల వేదిక కరీం నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. సి.వి. కుమార్, అన్నవరం దేవేందర్, పి.ఎస్. రవీంద్ర, రఘురామన్, పుప్పాల శ్రీరామ్ హాజరవుతారు.

దామరకుంట శంకరయ్య

ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం

అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 02:33 AM