Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 10 02 2025

ABN , Publish Date - Feb 10 , 2025 | 06:33 AM

ముగ్గురు కవుల సప్తతి సభలు, భూతపురి సాహిత్య పురస్కారం, కళింగాంధ్ర కవితలకు ఆహ్వానం, కథలకు ఆహ్వానం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 10 02 2025

ముగ్గురు కవుల సప్తతి సభలు

తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో ఫిబ్రవరి 16 ఉదయం 10గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో కందుకూరి శ్రీరాములు, నందిని సిద్ధారెడ్డి, నాళేశ్వరం శంకరం... ఈ ముగ్గురు కవుల సప్తతి సభ జరుగుతుంది. ముఖ్య అతిథి దేశపతి శ్రీనివాస్. సభలో కొండపల్లి నీహారిణి‌, బైస దేవదాస్, మామిడి హరికృష్ణ, దేవి ప్రసాద్ నరేష్ చారి తదితరులు పాల్గొంటారు.

బెల్లంకొండ సంపత్ కుమార్.

భూతపురి సాహిత్య పురస్కారం

భూతపురి సుబ్రహ్మణ్యశర్మ 88వ జయంతి సందర్భంగా 23వ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం ఫిబ్రవరి 16 ఉదయం 10 గంటలకు సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం, కడపలో జరుగుతుంది. పురస్కార గ్రహీత పుత్తా పుల్లారెడ్డి రూ.10,116- నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను స్వీకరిస్తారు. సభకు అధ్యక్షుడు జి. విశ్వనాథ కుమార్‌, ముఖ్య అతిథి కె. కృష్ణారెడ్డి, ప్రధానవక్త శలాక రఘునాథ శర్మ

భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి


కళింగాంధ్ర కవితలకు ఆహ్వానం

కళింగాంధ్ర కవుల కవిత్వంతో సిక్కోలు బుక్‌ ట్రస్ట్‌ తెస్తున్న వార్షిక సంచిక కోసం ప్రింట్‌ లేదా ఆన్‌లైన్‌ పత్రికలలో 2024లో ప్రచురితమైన తమ కవితలలో నచ్చిన రెండు కవితలను ఈమెయిల్‌: sikkolu books@ gmail.com లేదా వాట్సాప్‌: 99892 65444కు ఫిబ్రవరి 20 లోగా పంపాలి. వార్షిక కవితా సంకలనంతో పాటు కళింగాంధ్ర కవుల డైరక్టరీని కూడా ప్రచురిస్తున్నందున వర్తమాన కళింగాంధ్ర కవులు పేరు, ఫోన్‌ నెంబర్లను నమోదు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి.

సిక్కోలు బుక్‌ ట్రస్ట్

కథలకు ఆహ్వానం

నవమల్లెతీగ సాహిత్య మాసపత్రిక 18వ సంవత్సరంలో అడుగుపెడు తున్న సందర్భంగా తెస్తున్న కథల ప్రత్యేక సంచిక కో‍సం ఎ4 సైజులో 3–4 పేజీల కథలను ఫిబ్రవరి 27లోపు యూనికోడ్‌ లేదా డీటీపీతో పంపాలి. ఈమెయిల్: malleteega@gmail.com; చిరునామా: నవమల్లెతీగ మాసపత్రిక, 6-16-4, టి.ఎఫ్-–1, శుభశ్రీ టవర్స్, ఉయ్యూరు జమీందారు స్ట్రీట్, గాంధీనగర్, విజయవాడ–520003. ఫోన్‌: 92464 15150.

-కలిమిశ్రీ


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 10 , 2025 | 06:33 AM