A Telugu Poem on Nature Freedom: తెలుసుకోవాలని
ABN , Publish Date - Oct 20 , 2025 | 03:25 AM
సంద్రపు అలలను హాయిగ ఊయలలూపేదెవరో తెలుసుకోవాలి చుక్కలతో ఈ విశ్వం రాసే కావ్యమేమిటో తెలుసుకోవాలి పంజరంలోని...
సంద్రపు అలలను హాయిగ ఊయలలూపేదెవరో తెలుసుకోవాలి
చుక్కలతో ఈ విశ్వం రాసే కావ్యమేమిటో తెలుసుకోవాలి
పంజరంలోని విహంగమోలే ఆకాశాన్నే చూస్తూ ఉంటా
ఎగిరే పిట్టకు స్వేచ్ఛాగీతం నేర్పినదెవరో తెలుసుకోవాలి
చీకటి ఏలే రాజ్యాలన్నీ నిజాల నీడలు దాచేస్తున్నవి
రేయిని హరించి వెలుగును పంచే దారి ఏమిటో తెలుసుకోవాలి
ఇంటి పక్కనే ఉన్నా గానీ చెలితో మాటలు కలపనెందుకో
పున్నమి జాబిలి కలువల స్నేహం కుదిరెనెలాగో తెలుసుకోవాలి
నా తలపులలో అలజడులన్నీ శివమెత్తేలా
నర్తిస్తున్నవి
శాంతించేందుకు చక్కని కవితలు రాయుటెలాగో తెలుసుకోవాలి
శివకృష్ణ కొక్కుల
99896 27222
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Read Latest AP News And Telugu News