Salaam Janagam Book: సలాం జనగాం పుస్తకావిష్కరణ
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:11 AM
ఆఫ్రికన్ రచయిత చినువా అచెబే అన్నట్టు.. ‘సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోనంత కాలం, వేటగాళ్లు చెప్పిందే చరిత్ర అవుతుంది.’ అందుకే ప్రజల చరిత్రను ప్రజలే....
ఆఫ్రికన్ రచయిత చినువా అచెబే అన్నట్టు.. ‘సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోనంత కాలం, వేటగాళ్లు చెప్పిందే చరిత్ర అవుతుంది.’ అందుకే ప్రజల చరిత్రను ప్రజలే చెప్పాలి. ఆ పనిని చరిత్రాత్మకంగా చేశారు రచయిత సాంబరాజు యాదగిరి. ‘సలాం జనగాం’ పుస్తకంలో జనగాం గురించి ఆయన రాసిన అనేక కొత్త విషయాలు పాఠకులను అబ్బురపరుస్తాయి. ఆ పేరు ఎలా వచ్చిందో మొదలుపెట్టి, జిల్లాగా రూపాంతరం చెందడం వరకూ జరిగిన ఘటనలను ఆధారాలతో సహా నిరూపించారు రచయిత. పదుల సంఖ్యలో పుస్తకాలను అధ్యయనం చేసి, తొంభైమందిని ఇంటర్వ్యూలు చేసి సేకరించిన సమాచారంతో ఈ పుస్తకాన్ని రచించారు యాదగిరి. మొఘలులు, అసఫ్‌జాహీలు, దొరలు, జాగీర్దార్లు, స్వాతంత్ర్యానంతర పాలకులు జనగామను ఎట్లా ఏలారో వివరించారాయన. జనగాంలో తొలి సినిమా థియేటర్, తొలి దినపత్రిక వంటి అనేక విషయాలను ప్రస్తావించారు. ‘సలాం జనగాం’ పుస్తకావిష్కరణ ఈ నెల 8న జనగాం జిల్లా కేంద్రంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి చేతులమీదుగా జరుగనుంది. సభలో కె.ఆనందాచారి, రిజ్వాన్ బాషా షేక్ ఐఏఎస్, డా.ప్రసాదరావు, జయధీర్ తిరుమలరావు, లింగంపల్లి రాంచంద్రం, జి.రాములు, ఎం.డి. అబ్బాస్ తదితరులు పాల్గొంటారు.
డా. పసునూరి రవీందర్
ఈ వార్తలు కూడా చదవండి...
ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్
రైతు వ్యతిరేక చట్టాలపై ఎన్జీ రంగా పోరాటం చేశారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News