Tirumala Darshan: తిరుమలలో ఆఫ్‌లైన్ దర్శనం కల్పించాలి
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:04 AM
గతంలో తిరుమలలో భక్తుల కోసం ఆఫ్‌లైన్ దర్శనాలు ఉండేవి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులు ‘ఈ–దర్శన్’ ద్వారా కూడా సులభంగా...
గతంలో తిరుమలలో భక్తుల కోసం ఆఫ్‌లైన్ దర్శనాలు ఉండేవి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులు ‘ఈ–దర్శన్’ ద్వారా కూడా సులభంగా టికెట్టును పొందే వీలుండేది. కానీ ప్రస్తుతం ఆ సేవలు నిలిచిపోవడంతో వేంకటేశుడి దర్శనానికి భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. భక్తుల సౌకర్యం కోసం అంటూ ఇటీవల ఆన్‌లైన్ టికెట్ సర్వీసును టీటీడీ తీసుకొచ్చింది. కానీ సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వేంకటేశుని దర్శనానికి ఇబ్బందులు తప్పడంలేదు. టీటీడీ వెబ్‌సైట్‌లో సర్వర్ సమస్యలు, టిక్కెట్ స్లాట్లు క్షణాల్లో ఖాళీ కావడం, మోసపూరిత వెబ్‌సైట్లు పెరుగుతుండడం వంటివి భక్తుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. గతంలో తిరుమలలో సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఉండేవి. సాధారణ భక్తులు తాము నిర్దేశిత సమయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకునే సౌలభ్యమూ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ అవకాశం లేదు. ఆన్‌లైన్ టికెట్ దర్శనాల కారణంగా వారికి ఆ సదుపాయాల్లో అంతరాయం కలుగుతోంది. ఇప్పటికైనా టీటీడీ స్పందించి జిల్లా కేంద్రాలలో తిరిగి ఈ–దర్శన్ కౌంటర్లను ప్రారంభించాలి. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, గ్రామీణ ప్రజల కోసం ఆఫ్‌లైన్ దర్శనాలను తిరిగి ప్రారంభించాలి.
అప్పన్న గొనప
ఈ వార్తలు కూడా చదవండి...
ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్
రైతు వ్యతిరేక చట్టాలపై ఎన్జీ రంగా పోరాటం చేశారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News