Provide Age Verification Certificates: వయసు నిర్ధారణ పత్రాలు ఇవ్వాలి
ABN , Publish Date - Nov 05 , 2025 | 01:36 AM
రాష్ట్రంలో అరవైయ్యేళ్లు పైబడిన కొందరు వృద్ధుల వయసు వారి ఆధార్ కార్డుల్లో 56, 45...గా నమోదైంది. ఇలా ఆధార్ కార్డుల్లో తక్కువ వయసు చూపిస్తుండడంతో...
రాష్ట్రంలో అరవైయ్యేళ్లు పైబడిన కొందరు వృద్ధుల వయసు వారి ఆధార్ కార్డుల్లో 56, 45...గా నమోదైంది. ఇలా ఆధార్ కార్డుల్లో తక్కువ వయసు చూపిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది వృద్ధులు పింఛన్‌కు దూరమవుతున్నారు. ఉదాహరణకు... 2023 నవంబరు నాటికి ఒక్క విజయనగరం జిల్లాలోనే ఇలా వయసు తక్కువగా నమోదై, ప్రభుత్వ పింఛన్‌కు నోచుకోలేని వృద్ధులు 3733 మంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య భారీగానే ఉండొచ్చు కూడా. వృద్ధులకు వారి నిజ వయసు ప్రకారం నిర్ధారణ పత్రాలు ఇవ్వాలని కోరుతూ, విజయనగరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గతంలో లేఖ రాశారు. రెండేళ్లు దాటినా దీనిపై ఫలితం శూన్యం. ప్రభుత్వాధికారుల తాత్సారం, పట్టింపు లేమి కారణంగా పింఛన్లు అందక, ఆర్థిక సమస్యలతో ఎంతో మంది వృద్ధులు మరణిస్తున్నారు. ఇకనైనా రాష్ట్రంలోని పాలకులు, అన్ని జిల్లాల కలెక్టర్లు వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలి. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో స్థానిక వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు అందించేలా ఆదేశాలు జారీ చేయాలి.
శీరాపు శ్రీనివాసరావు
ఈ వార్తలు కూడా చదవండి...
రహదారుల నాణ్యతలో రాజీపడబోం.. అధికారులకి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్
Read Latest AP News And Telugu News