Share News

DSC Teachers 2024: ఏడాది యాదిలో కొత్త టీచర్లు

ABN , Publish Date - Oct 07 , 2025 | 05:00 AM

2024 డీఎస్సీ ద్వారా ఎంపికయిన 10,500 మంది ఉపాధ్యాయులు అక్టోబర్ 9తో ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకుంటున్నారు. ఏడాది కాలంగా కొత్త టీచర్లు విన్నూత పద్ధతిలో బోధన చేయడమే...

DSC Teachers 2024: ఏడాది యాదిలో కొత్త టీచర్లు

2024 డీఎస్సీ ద్వారా ఎంపికయిన 10,500 మంది ఉపాధ్యాయులు అక్టోబర్ 9తో ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకుంటున్నారు. ఏడాది కాలంగా కొత్త టీచర్లు విన్నూత పద్ధతిలో బోధన చేయడమే కాకుండా, ఇతర అంశాల్లో ఎంతో పరిణతి చెందిన ఉపాధ్యాయులుగా అనుభవం గడించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2017, 2024లో మాత్రమే డీఎస్సీ నిర్వహించారు. క్రమంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం, గురుకుల పాఠశాలలు రావడం కూడా డీఎస్సీపై ప్రభావం చూపింది. అయితే ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడంలో కాలయాపనతో అభ్యర్థులు 2017 డీఎస్సీ కోసం ప్రత్యక్ష ఆందోళనతో పాటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. ఇక అనేక ఆందోళనల నేపథ్యంలో మళ్ళీ 2023లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ అతి తక్కువ పోస్టులు మంజూరు చేయడంతో అభ్యర్థులు నిరాశ చెంది, ఆందోళనలు చేశారు. అప్పుడే సాధారణ ఎన్నికల కోడ్ రావడం, కొత్త ప్రభుత్వం రావడంతో పరీక్షలు వాయిదాపడ్డాయి. అంతలోనే లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో మరిన్ని టీచర్ పోస్టులు జత చేసి డీఎస్సీ రీ నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేయగా, ఎన్నికల కోడ్ వచ్చే లోపే 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, వేగంగా పరీక్షలు నిర్వహించి, నియామక ప్రక్రియ పూర్తి చేశారు. ముఖ్యమంత్రి, అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో 2024 సెప్టెంబర్ 30న ఫలితాలు విడుదలయ్యాయి. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా డీఎస్సీ నియామక పత్రాలు అందుకోవడం మరువలేని ఘట్టం.

– రావుల రామ్మోహన్‌రెడ్డి

ఇవి కూడా చదవండి..

ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 07 , 2025 | 05:00 AM