Visakhapatnam Summit: విశాఖ సదస్సులో పెట్టుబడుల వెల్లువ
ABN , Publish Date - Nov 19 , 2025 | 01:58 AM
విశాఖ భాగస్వామ్య సదస్సు దిగ్విజయం కావడమేగాక, అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఏపీ ప్రభుత్వం ఆల్ టైం రికార్డును సృష్టించింది. దాదాపు 60 దేశాల నుంచి 4,975 మంది ప్రతినిధులు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనడం ఒక రికార్డు. ఈ సదస్సుకు...
విశాఖ భాగస్వామ్య సదస్సు దిగ్విజయం కావడమేగాక, అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఏపీ ప్రభుత్వం ఆల్ టైం రికార్డును సృష్టించింది. దాదాపు 60 దేశాల నుంచి 4,975 మంది ప్రతినిధులు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనడం ఒక రికార్డు. ఈ సదస్సుకు పలు దేశాల నుంచి 630 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తడం విశేషం. ఇది ప్రభుత్వ అంచనా కంటే 30 శాతం అదనం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే పారిశ్రామికాభివృద్ధిపై దృష్టిపెట్టింది. సింగపూర్, యూఏఈ, లండన్ వంటి దేశాల్లో సీఎం చంద్రబాబు, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వంటి దేశాల్లో ఐటీ మంత్రి నారా లోకేశ్ పర్యటించి, ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అక్కడి పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించారు. దీంతో పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తల నుంచి భారీ స్పందన లభించింది. రెండు రోజుల సీఐఐ సదస్సులో వైద్యారోగ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, టెక్స్‌టైల్స్, పర్యాటక రంగాల్లోనూ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, హెట్రోడ్రగ్స్, భారత్ డైనమిక్స్, జేకే ఏరోస్పేస్, అదానీ విల్మర్, ఎన్ఎస్టీఎల్ క్వాంటమ్ కంప్యూటింగ్ స్టిములేటింగ్ సెంటర్, సిడాక్, పాస్కల్ తదితర సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.
సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సహా మొత్తంగా మంత్రులందరూ కలిసి 490 ఎంఓయూల ద్వారా రూ.5,62,506 కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చగలిగారు. ‘క్లియర్ పాలసీ దిశ, ఫాస్ట్‌ట్రాక్ పరిశ్రమ అనుమతులు, పెట్టుబడిదారులకు గవర్నెన్స్ హామీ’ ఇవి ఏపీని మళ్లీ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడుల మ్యాప్‌లో ముందుకు తెచ్చాయి. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాల్సిన అంశాలు– ఒప్పందాలు జరిగిన పెట్టుబడులను గ్రౌండ్‌లోకి తేవడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను వేగంగా విస్తరించడం, యువతకు ఇండస్ట్రీ స్కిల్ శిక్షణ ప్రోగ్రాం ఏర్పాటు, భవిష్యత్ టెక్నాలజీలకు ప్రత్యేక జోన్‌లు... వంటివి సదస్సు విజయాన్ని నిజంగా కొలిచే అంశాలు.
నీరుకొండ ప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి..
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Read Latest AP News And Telugu News