ప్రసాదమోహనము
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:07 AM
మధుర మధుర మీ మోహనగానము బుధనుత బాలకృష్ణ ప్రసాద కవితము వర నారదమౌని వీణాగానము సరవి అన్నయ్యకు సంపదైన గానము...

మధుర మధుర మీ మోహనగానము
బుధనుత బాలకృష్ణ ప్రసాద కవితము
వర నారదమౌని వీణాగానము
సరవి అన్నయ్యకు సంపదైన గానము
చెర రామదాసుకు చనవైన గానము
తిరమై త్యాగయ్యకు ధనమైన గానము
భక్తజనుల హరి భజనమె గానము
శక్తులౌ వీరుల శౌర్యమీ గానము
రక్తుల ప్రేమసరాగమె గానము
యుక్తి సరిగపద యోగమె గానము
అల వేదంబుల నమరిన గానము
వెలలేని వ్రేపల్లె వేణుగానము
నవి శ్రీవేంకటేశునామమె గానము
కలనైన నెక్కడ కానము కానము
డాక్టర్ కందాళ లక్ష్మీనారాయణ
నెల్లూరు
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ
Also Read: నా చేతిలో కత్తి పెట్టి..
Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..
For AndhraPradesh News And Telugu News