Share News

Journey by Swathi Sripada: ఏమై ఏమీ కాక

ABN , Publish Date - Sep 29 , 2025 | 05:26 AM

ఎక్కడెక్కడో వెతికి వచ్చాను రాత్రి మరగ కాగి దట్టంగా కట్టిన స్వప్నాల మీగడ పొరలకు ఆ వైపునా ఈ వైపునా...

Journey by Swathi Sripada: ఏమై ఏమీ కాక

ఏమై... ఏమీ కాక...

1.

ఎక్కడెక్కడో వెతికి వచ్చాను

రాత్రి మరగ కాగి దట్టంగా కట్టిన

స్వప్నాల మీగడ పొరలకు ఆ వైపునా ఈ వైపునా

కళ్ళవెనక కీకారణ్యపు కోనకోనల్లోనూ

కలతనిద్ర ఎడారుల ఇసుకతెరల్లోనూ

అలసి సొలసి సొమ్మసిలిన నిద్ర నీరెండలో

ఆ రెండో నీడ నువ్వేనా...

2.

పాట వినబడుతూనే ఎక్కడో ఉసూరుమంటూ

క్రమం తప్పని దినచర్య

కొక్కానికి వేళ్ళాడుతున్న తపన

ప్రాణం పోసుకు సజీవమవుతుంది

పాటతోపాటే సాగిసాగి రెప్పవాలని సముద్రమవుతుంది

సముద్రమే పాటై పోటై హద్దులు చేరిపేసుకున్నవేళ

అణువణువునా శ్రుతిలయల హోరే

3.

ఆ రోజున స్తబ్ధంగా ఉదయించిన మౌనాన్ని

విసిగించి విసిగించి బేరాలాడిన చూపులు

ప్రశంసల మచ్చుజల్లి వశీకరించిన క్షణాన

కూకటివేళ్ళతో నన్ను పెకలించి వేసి

నీ జీవితాన నాటుకున్నప్పుడు

వేదమై నాదమై భూనభోతలాలమధ్య గానమై

నీ చుట్టూ ఇక సుడిగాలినై...

4.

పైపైన ఎక్కడో చూపానని

నీలి గాలి వయ్యారాల అలల్లోకి

సుళ్ళు తిరిగే దృశ్యాదృశ్య వృత్తాలమై

ఎవరికి తెలుసు ఏమయామో ఏమి కాలేదో....

స్వాతీ శ్రీపాద

82972 48988

ఇవీ చదవండి:

Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి

Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 05:27 AM