Chenchu Yakshagana: చెంచు యక్షగానం ప్రదర్శన
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:16 AM
బొమ్మలాటల్లో అనేక రకాలు ఉన్నాయి. ప్రసిద్ధి పొందిన తోలుబొమ్మలాట ఉంది. 56 చేర్యాల బొమ్మలు చూపిస్తూ మందహెచ్చులు అనే యాదవుల ఉపకులం వారు చెప్పే కాటమరాజు కథ...
బొమ్మలాటల్లో అనేక రకాలు ఉన్నాయి. ప్రసిద్ధి పొందిన తోలుబొమ్మలాట ఉంది. 56 చేర్యాల బొమ్మలు చూపిస్తూ మందహెచ్చులు అనే యాదవుల ఉపకులం వారు చెప్పే కాటమరాజు కథ ప్రదర్శన ఉంది. వీటిలాగే ‘చెక్కబొమ్మలాట’ కూడా అత్యంత ప్రాచీన కళారూపం. సుమారు మూడున్నర అడుగుల పొడవున్న చెక్కబొమ్మలను ఆడిస్తూ, పాడుతూ చక్కని ప్రదర్శన నిర్వహించే కళారూపాలు ఒక్కొక్కటే అంతరించిపోతున్నాయి. తరాలుగా కళాకారులు తమ కళలను పరిరక్షించుకుంటూ రావడం ప్రశంసనీయం. నలభయ్యేళ్ల కిందట జానపదసంస్థ వారు ఈ కళారూపాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. విలక్షణ కళా ప్రదర్శనలు, అట్టడుగు వర్గాల కథా గానాలను, రూపాలను పరిరక్షించే ప్రత్యేక పథకాలు మాత్రం పాలకులు రూపొందించడంలేదు. చేయూతనివ్వడం సంగతి పక్కనపెడితే, కనీసం ఆయా కళారూపాలను గుర్తించే స్థితిలోనూ ప్రభుత్వం లేకపోవడం బాధాకరం. నిజానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనైనా ఈ కళారూపాలకు మరింత ప్రోత్సాహం, గుర్తింపు రావలసి ఉండగా, అందుకు భిన్నంగా నేడు అవి క్షీణించిపోయే పరిస్థితి నెలకొన్నది. ఆదరణ తగ్గడంతో జానపద, ఆదివాసీ కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించుకునే అవకాశాలు తగ్గిపోయాయి. ఈ 50 రకాల కళారూపాల ప్రదర్శనకు సరైన వేదిక లేకపోవడం కూడా కళాకారులకు ప్రధాన సమస్యగా మారింది. అందుకే కళలకు ప్రోత్సాహకరంగా ‘ఆద్య కళా మ్యూజియం, దక్కన్ టీవీ’ సంస్థలు కలిసి సదస్సుకు ఏర్పాటు చేస్తున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలోని ‘సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల’లో నేటి (శనివారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. అమ్మాపురం గ్రామానికి చెందిన కళాకారులతో చెక్క బొమ్మల ప్రదర్శన, చెంచు కథ– యక్షగాన ప్రదర్శన ఉంటుంది.
ఆచార్య గూడూరు మనోజ మోతే కనకయ్య
ఈ వార్తలు కూడా చదవండి...
ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్
రైతు వ్యతిరేక చట్టాలపై ఎన్జీ రంగా పోరాటం చేశారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News