Share News

Book Launch Event: పుస్తకావిష్కరణ సభ

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:00 AM

కాళ్ళ కింద దుమ్ములా పడి ఉంటారనుకుంటున్న మట్టి మనుషుల కళ్ళల్లో నలుసైన దొరలు, భూస్వాములు, పోలీసులు, రాజ్య వివక్షపై ఎదురీదిన చరిత్రకు అక్షర రూపం ఇనుకొండ తిరుమలి రచనలు....

Book Launch Event: పుస్తకావిష్కరణ సభ

కాళ్ళ కింద దుమ్ములా పడి ఉంటారనుకుంటున్న మట్టి మనుషుల కళ్ళల్లో నలుసైన దొరలు, భూస్వాములు, పోలీసులు, రాజ్య వివక్షపై ఎదురీదిన చరిత్రకు అక్షర రూపం ఇనుకొండ తిరుమలి రచనలు. అట్టడుగు వర్గం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయి వరకు ఆయనొక సుపరిచిత రచయిత. ఆయన రచనలన్నీ అణగారిన వర్గాల చరిత్రలో భాగంగానే వచ్చాయి. అందులో భాగమే ‘‘అడుగడుగునా అగౌరవం, అనాదరణ’’. ఈ పుస్తకంలో సంచార విముక్తి జాతుల దుర్భర జీవితాల గురించి ఉంది. భారతీయ సమాజంలో కుల వ్యవస్థ మిగిల్చిన చేదు నిజాలను రచయితే స్వయంగా గుడిసెలను, వారి గుండె గొంతుకలోని ఆవేదనలు, ఆక్రందనలను ఫీల్డ్‌ సర్వేలు చేసి, చారిత్రక సమాచారం సేకరించి, రచించిన పుస్తకమిది. తనను తాను వెతుక్కుంటున్న ఓ చరిత్ర– ఈ పుస్తకం. ఎస్‌.వినయకుమార్‌ అనువదించిన ఈ పుస్తకావిష్కరణ సభ నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి, మెయిన్‌ హాల్‌లో జరుగనున్నది. తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథి.

భూపతి వెంకటేశ్వర్లు

రాష్ట్ర అధ్యక్షులు, టీపీఎస్‌కే

ఈ వార్తలు కూడా చదవండి..

యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్

ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

For More AP News And Telugu News

Updated Date - Sep 10 , 2025 | 01:00 AM