BC Reservations: బీసీ రిజర్వేషన్లకు స్త్రీలూ ఉద్యమించాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:28 AM
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ సమాజం రోడ్లపైకి వచ్చింది. అది కూడా సైనికులుగా మాత్రమే, సేనానులుగా కాదు. ఈ పోరాటంలో మహిళల పాత్ర...
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ సమాజం రోడ్లపైకి వచ్చింది. అది కూడా సైనికులుగా మాత్రమే, సేనానులుగా కాదు. ఈ పోరాటంలో మహిళల పాత్ర ఎందుకు పరిమితంగా ఉందనేదే మౌలిక ప్రశ్న.
ఈ ఆందోళనలో మహిళల పాత్ర సపోర్టివ్ రోల్‌గానే! ఉదాహరణకు– బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వ్యతిరేకత వ్యక్తం అయిన క్రమంలో కొద్దిమంది మహిళలు ఎమోషనల్ స్పీచ్‌లకే పరిమితం అయ్యారు. సోషల్ మీడియాలో మాత్రమే బీసీ రిజర్వేషన్ల గురించి చర్చ చేశారు. కానీ ఇది వ్యక్తిగత ఆవేదనే. ప్రత్యేకంగా ప్రజాందోళనలు నిర్వహించడంలో గానీ, పోరాట రూపాలను లేదా నిర్ణయాలు తీసుకోవడంలో గానీ బీసీ మహిళలు ముందు వరుసలో లేరు. బీఆర్‌ఎస్ నాయకురాలు, ధనిక వర్గానికి చెందిన కవిత మాత్రమే బీసీల ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. ప్రగతిశీల, సామాజిక ప్రజాస్వామిక దృష్టి, అవగాహన గల మహిళలు అక్కడక్కడ మాత్రమే కనిపించారు. అయితే, బీసీ మహిళలు మూడు రకాల అణచివేతలకు గురవుతున్నారు– అవి: వర్గం, కులం, లింగం. పురుష నాయకుల ఆందోళనకు ముందుండి నడిపిస్తే, మహిళల పాత్ర ఎమోషనల్ సపోర్ట్, హౌస్‌హోల్డ్ మద్దతే. ఇది బీసీ మహిళల మార్పునకు లేదా మహిళా విప్లవానికి అడ్డంకి. మహిళలు లేకుండా సామాజిక న్యాయం అసంపూర్ణం.
మహిళల పాత్ర అభివృద్ధి కాకపోవడానికి ప్రధాన కారణం పితృస్వామిక కుటుంబ వ్యవస్థ. బీసీ సమాజాల్లో మహిళలు ఇంటి పనులు, పిల్లల పెంపకం, ఆర్థిక బాధ్యతల్లో మునిగిపోయి ఉంటారు. ఆందోళనలు నిర్వహించే సంఘాలు (జేఏసీ) పురుషుల ఆధిపత్యంలో ఉండటం వల్ల, మహిళలకు లీడర్‌షిప్ అవకాశాలు ఇవ్వడం లేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టులు మహిళలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారే గాని వారిని విప్లవశక్తిగా మార్చడానికి యత్నించడం లేదు. మహిళలను అణచివేస్తే, విప్లవం బలహీనమవుతుంది. పాలకవర్గాలు మహిళలను డివైడ్ చేస్తాయి, వారి పాత్రను పరిమితం చేస్తున్నాయి.
బీసీ ఆందోళనల్లో మహిళల చొరవ లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. పైన పేర్కొన్న వాటితో పాటు సామాజిక భయాలూ ఉన్నాయి. ఆందోళనల్లో పాల్గొంటే కుటుంబం, సమాజం నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. మహిళలకు విద్య, ఆర్థిక స్వాతంత్ర్యాలు లేవు. బీసీల్లో మహిళల అక్షరాస్యత రేటు తక్కువ. ఆందోళనల్లో పాల్గొన్న మహిళలను మీడియా, సమాజం ‘అసాధారణం’గా చూస్తుంది. ఇది మహిళల్లో ఆసక్తిని అణచివేస్తుంది. వీటిని ఛేదించి, సామాజిక విప్లవంలో మహిళల పాత్రను పెంచాలి. బీసీ సంఘాలు (జేఏసీ) మహిళలకు 50 శాతం లీడర్‌షిప్ పోస్టులు ఇవ్వాలి. మహిళలు చొరవగా, ఆందోళనల్లో పాల్గొనాలి. అప్పుడు మాత్రమే బీసీ రిజర్వేషన్ల 42 శాతంలో 50 శాతం మహిళా రిజర్వేషన్ సాధ్యమవుతుంది.
పి. రేణుక భూంపల్లి
ఈ వార్తలు కూడా చదవండి..
రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..
For More AP News And Telugu News