అరుణోదయ 50 ఏళ్ల పరిపూర్తి సభ
ABN , Publish Date - May 11 , 2025 | 02:32 AM
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జంపాల చంద్రశేఖర్ చొరవతో 1974, మే 12న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడింది. సంప్రదాయిక కళారూపాలలోని వస్తువు సారాన్ని మార్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త సారంతో...
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జంపాల చంద్రశేఖర్ చొరవతో 1974, మే 12న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడింది. సంప్రదాయిక కళారూపాలలోని వస్తువు సారాన్ని మార్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త సారంతో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు జరిగిన పోరాటాల్లో డజన్ల కొద్దీ కళారూపాలను అరుణోదయ అందిపుచ్చుకున్నది. శ్రీకాకుళం, గోదావరి లోయ, కరీంనగర్ వంటి సాయుధ రైతాంగ పోరాటాలను గానం చేసింది. సింగరేణి, బీడీ కార్మికుల వంటి ఎందరో శ్రమజీవుల సమస్యలపై కళారూపాలు రూపొందించింది. ఆదివాసుల స్వయంపాలనను ఎలుగెత్తి పాడింది. స్త్రీ విముక్తిని చాటింది. మైనార్టీల ఆత్మరక్షణ హక్కులను లేవనెత్తింది. దళితుల–పీడిత కులాల సమస్యలను, వర్గ–కుల పోరాటాల ఆవశ్యకతను గానం చేసింది. ఆపరేషన్ ‘కగార్’ ఆపి శాంతిచర్చలు జరగాలని పాడుతున్నది. ప్రాంతీయ ప్రజాస్వామ్య హక్కుల్లో తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా ప్రజల ఆకాంక్షలను ఎలుగెత్తింది. 2024 డిసెంబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో తన 50 వసంతాల సభను అరుణోదయ నిర్వహించుకుంది. అయితే తన 50 ఏళ్ల చరిత్రను, కృషిని, పరిస్థితిని సృజించుకునే పనితో పాటు ‘అరుణోదయం’ అనే సావనీర్ ఆవిష్కరణ, అరుణోదయ డాక్యుమెంటరీ, విప్లవ ప్రజాసంస్థల 50 ఏళ్ల ప్రస్థానం పాటను ప్రదర్శించుకుంటూ అరుణోదయ 50 ఏళ్ల పరిపూర్తి స్ఫూర్తి ముగింపు సభ జరగనున్నది.
హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మే 12న జరిగే ఈ సభలో అరుణోదయ నాగన్న, విమలక్క, తమ్మారెడ్డి భరద్వాజ, మీనా కందస్వామి, డా. బుర్ర రమేష్, దివికుమార్, ప్రొ. జయధీర్ తిరుమలరావు, డా. ఎ.కె.ప్రభాకర్, కొల్లాపురం విమల, రాంసత్తయ్య, అంబిక, ఎనిశెట్టి శంకర్, అనిత పాల్గొంటారు. ‘ప్రజా సంస్కృతి– సాంస్కృతికోద్యమ నిర్మాణ ఆవశ్యకత’పై పలువురు ప్రసంగిస్తారు. – అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గాలు
ఇవి కూడా చదవండి
Operation Sindoor: పౌరులు, ఆలయాలపైనే పాక్ దాడి.. వీడియోలతో భారత్ కౌంటర్
Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం.. అందులో నిజం లేదు..
Read Latest International News And Telugu News