అక్కసుతోనే విష ప్రచారం
ABN , Publish Date - May 16 , 2025 | 06:13 AM
అమరావతి రాజధాని నిర్మాణానికి, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ వ్యాసాలూ రాస్తున్నవారే నిజమైన ద్రోహులు. జగన్ ముఠా అమరావతిపై పచ్చి స్వార్థంతో పనిగట్టుకుని విషం చిమ్ముతున్నది. ఇటువంటి ద్వేషపూరితమైన ప్రచారాన్ని మేధావులు ఖండించకుండా మౌనం పాటించడం...
అమరావతి రాజధాని నిర్మాణానికి, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ వ్యాసాలూ రాస్తున్నవారే నిజమైన ద్రోహులు. జగన్ ముఠా అమరావతిపై పచ్చి స్వార్థంతో పనిగట్టుకుని విషం చిమ్ముతున్నది. ఇటువంటి ద్వేషపూరితమైన ప్రచారాన్ని మేధావులు ఖండించకుండా మౌనం పాటించడం ప్రమాదకరం. అమరావతి నమూనాలో ప్రజల జీవనోపాధి, సామాన్యుల గృహ వసతి, సామాజిక అభివృద్ధి, సమ న్యాయం, ఆర్థిక అసమానతల నిర్మూలన వంటి వాటికి ప్రాధాన్యత లేదు. ప్రైవేట్ పెట్టుబడులకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సహించదు, అలాంటివి రాకుండా అడుగడుగునా ప్రభుత్వం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది. సంపన్నులకు, ఉన్నతి మధ్యతరగతి వర్గాలకు అత్యంత విలాసవంతమైన ఆకాశహార్మ్యాలు నిర్మించబోతున్నారు. వీరికి అవసరమైన విధంగా అన్ని రకాల సౌకర్యాలు, పార్కులు, క్రీడా, రిక్రియేషన్ వంటివి చేపడుతున్నారు. అలాగే మంచి నీరు, పారిశుధ్యం, రవాణా, విద్యుత్, పౌర సేవలు, మౌలిక సదుపాయాలు వంటివి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పట్టణాల్లో వలే ఉండవు. ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడవు, కొద్దిమంది గుత్తాధిపత్యంలోకి మారతాయి. వీటికి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పి.పి.పి), జాయింట్ వెంచర్, ప్రత్యేక ఉద్దేశ సంస్థ (స్పెషల్ పర్పస్ వెహికల్) ఇలా అనేక పేర్లతో ముసుగులు తొడుగుతారని ఇప్పటికే ప్రచారం ప్రారంభమయింది. అమరావతి రాజధాని అనేది విశాఖపట్నం, విజయవాడ లేదా హైదరాబాద్ వలె అమరావతి మున్సిపల్ కార్పొరేషన్‌గా అమలులోకి తీసుకొస్తారా? లేదా? అనేది ప్రభుత్వం చెప్పటం లేదు. ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చినా ఇది ఆచరణలో నామమాత్రంగానే ఉంటుంది. పరిమితమైన అధికారాలు కలిగి, కేవలం పన్ను వసూళ్లకే పరిమితం కావొచ్చు. ఎందుకంటే భూమిపై అమరావతి కార్పొరేషన్‌కి ఎలాంటి అధికారం ఉండదు. ఈ భూమి మొత్తం ఇప్పుడు సీఆర్‌డీఏ ఆధీనంలో ఉంది. నివాసాలన్నీ స్వయం పాలనతో భారీ గేటెడ్ కమ్యూనిటీలుగా రూపొందుతున్నాయి. అమరావతి ఎన్నటికీ ప్రజా రాజధాని కాదు. ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టే విధంగా అమరావతిపై విషం కక్కుతూ వైసీపీ నేతలు వ్యాసాలు రాయిస్తున్నారు.
అమరావతి రాజధానిపైనే నిధుల్ని వ్యయం చేస్తూ ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, కోట్లాది రూపాయలు అమరావతికి అప్పు తెచ్చి వ్యయం చేస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తూ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు. కానీ వాస్తవంగా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ పథకం. ఆ విషయం సామాన్య ప్రజలకు తెలియదు. రాష్ట్రానికి పదకొండేళ్లుగా లేని రాజధానిని నిర్మిస్తుంటే కళ్లుండీ చూడలేని కబోదులు, తమ రాజకీయ ప్రయోజనం కోసం అమరావతిపై తప్పుడు రాతలు రాయిస్తున్నారు. అమరావతిపై విద్వేషాలను రెచ్చగొట్టేలా వైసీపీ నాయకులు చేస్తున్న యత్నాలను ఎప్పటికప్పుడు బలంగా తిప్పికొట్టాలి. అమరావతి నిర్మాణ దశ నుంచే రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారుతుందని, ఉద్యోగాంధ్రప్రదేశ్‌గా మారుతుందనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అమరావతి నిర్మాణ వ్యయంలో అధిక శాతం రాజధాని భూముల నుంచే సమకూరనున్నది. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందన్న అక్కసుతోనే ఈ వికృత రాజకీయానికి వైసీపీ పూనుకొంటున్నది.
నీరుకొండ ప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News