A Mothers Blessing: అమ్మ దీవెన
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:59 AM
తప్పొప్పులను క్షమాగుణంతో మన్నించి నిత్య శోభితమైన ఆనంద వీచికలు నిరంతరం వెలుగై ప్రసరించే అమ్మ దీవెన అమ్మ దీవెన కోటి వరాల కానుక...
తప్పొప్పులను క్షమాగుణంతో మన్నించి
నిత్య శోభితమైన ఆనంద వీచికలు
నిరంతరం వెలుగై ప్రసరించే అమ్మ దీవెన
అమ్మ దీవెన కోటి వరాల కానుక
ఒడిదుడుకుల జీవన ప్రయాణం దారుల్లో
అలజడులు లేని గమ్యాన్ని చేరువ చేసి
కష్టాల కడలి సునాయాసంగా దాటే శక్తిని
నొసంగు దుర్గమ్మను కొలిచిన తరుణాన
ఈతి బాధలతో జీవితాన్ని ఈడుస్తూ
సంకటాల కుంపటి నెత్తిన మోసే తీరులో
దోషాలను సంహరించే మహాకాళిగా
వెన్నంటి నడిపించును తలచినంతనే
గ్రహ బాధల ధీనావస్థల చీకటి తెరలలో
రుణ బాధల కడగండ్లు కన్నీటితో
అలమటించే మనిషి మననంలో దుర్గమ్మ
కొలువైన తక్షణం శాంతి చేకూరు జీవితాన
సమభావమే జీవన పరమార్ధమై
మానవతే మనిషి నిరంతర బ్రతుకై
కొలమానం లేని భక్తి తత్పరతతో కీర్తించి
నమ్మిన భక్తులెల్లరకు అమ్మవారే ప్రతినిత్యం
దీవించి కరుణించి వరమిచ్చే శరణ్యం
నరెద్దుల రాజారెడ్డి
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News