Share News

Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు?

ABN , Publish Date - Nov 04 , 2025 | 03:48 PM

పూజ చేసి.. ప్రతిఫలం దక్కాలంటే భక్తులు నియమ నిష్టలతో ఉండాలి. అలా అయితేనే ప్రతి ఫలం దక్కుతోంది. మహా శివరాత్రికి ఏ మాత్రం తీసి పోని కార్తీక పౌర్ణమి వేళ భక్తులు ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే.. ?

Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు?

కార్తీక పౌర్ణమి.. మహాశివరాత్రితో సమానమని పండితులు చెబుతారు. అందుకే ఈ రోజు సముద్ర, నదీ స్నానాలకు భక్తులు పోటెత్తుతారు. అనంతరం ఆలయాలకు వెళ్లి అమ్మ అయ్యవార్లను దర్శించి.. ప్రత్యేక పూజలు చేస్తారు. అందులో భాగంగా.. 365 వత్తులతో దీపారాధన చేస్తారు. ఇక ఈ రోజు.. కేదారేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక నోములు సైతం భక్తి శ్రద్ధలతో నోచుకుంటారు. ఈ రోజు ఈ పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలను భక్తులు అందుకుంటారు. అయితే ఈ రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే..?


pournami-06.jpg

ఏం చేయాలంటే..?

  • కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారు జామునే నిద్ర లేచి.. పవిత్ర స్నానం ఆచరించి పరమ శివుడు, మహా విష్ణువు, శ్రీలక్ష్మీని పూజించాలి.

  • నదిలో దీపాలను దానం చేస్తే మంచిది. అలా కుదరకుంటే ఆలయంలోనైనా దీపాన్ని దానం చేయాలి.

  • విష్ణు సహస్ర నామాలతోపాటు లలితా సహస్ర నామాలు సైతం పారాయణం చేస్తే మంచి జరుగుతుంది.

  • చంద్రుడికి పచ్చిపాలను నీటిలో కలిపి అర్పిస్తే విశేష ఫలితాలు పొందవచ్చు.

  • కార్తీక పౌర్ణమి వేళ.. గోదానం చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకోవచ్చు. బెల్లం, దుస్తులను పేదలకు దానం చేయడం వల్ల శుభం జరుగుతుంది.


deepavali.jpg

ఇలా చేయకండి..

  • కార్తీక పౌర్ణమి రోజు.. ఇంట్లో చీకటి ఉండకుండా చూసుకోవాలి.

  • ఈ రోజు మద్యం, మాంసహారం ముట్టు కోకూడదు.

  • ఇంటికి వచ్చిన పేదలు, నిస్సహాయకులను ఖాళీ చేతితో పంపకూడదు. పెద్ద వారిని అవమానించడం కానీ.. వారిని బాధ పెట్టడం కానీ.. అసభ్యకరంగా మాట్లాడడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.

  • కార్తీక పౌర్ణమి నాడు వస్త్ర దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. పేదవారికి, లేని వారికి ఆహారం దానం చేయడం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ పౌర్ణమి వేళ.. బెల్లాన్ని దానంగా ఇస్తే లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. మహా శివరాత్రితో సమానమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు తులసి, రావి చెట్లు ముందు అవు నెయ్యితో దీపం వెలిగిస్తే.. వారి వారి కుటుంబాల్లో సంతోషం, శ్రేయస్సు, శాంతి కలుగుతుందని పండితులు చెబుతారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కార్తీక పౌర్ణమి.. 365 వత్తులతో దీపారాధన.. ఎందుకు వెలిగిస్తారంటే?

ఈ వస్తువులను దానం చేస్తే.. అమ్మవారి అనుగ్రహం..

For More Devotional News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 04:17 PM