ఈ వారం వాహనాలు నడపడంలో ఆ రాశుల వారు జాగ్రత్త..
ABN , Publish Date - Feb 23 , 2025 | 07:58 AM
మనుషులపై రాశి ఫలాలు విపరీతమైన ప్రభావం చూపుతాయని వేద పండితులు చెబుతున్నారు. కొన్ని రాశుల వారికి కొన్ని వారాలు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి కొన్ని వారాలు ప్రతికూలంగా ఉంటాయి. అలాగే ఇంకొన్ని రాశుల వారికి కొన్ని వారాల్లో అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఈ వారంలో కొన్ని రాశుల వారు వాహనాలు నడపడంలో జాగ్రత్తగా ఉండాలట. అలాగే ఈ వారంలో ఏయే రాశుల వారికి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం..

మనుషులపై రాశి ఫలాలు విపరీతమైన ప్రభావం చూపుతాయని వేద పండితులు చెబుతున్నారు. కొన్ని రాశుల వారికి కొన్ని వారాలు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి కొన్ని వారాలు ప్రతికూలంగా ఉంటాయి. అలాగే ఇంకొన్ని రాశుల వారికి కొన్ని వారాల్లో అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఈ వారంలో కొన్ని రాశుల వారు వాహనాలు నడపడంలో జాగ్రత్తగా ఉండాలట. అలాగే ఈ వారంలో ఏయే రాశుల వారికి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం..
అనుగ్రహం
23 ఫిబ్రవరి- 1 మార్చి 2025
పి.ప్రసూనా రామన్
................................................................................
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ము ఖులను చేస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. పెట్టు బడులు కలిసిరావు. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. శుభకార్యానికి యత్నాలు సాగి స్తారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ముఖ్యులకు వీడ్కోలు, స్వాగతం పలుకుతారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
అన్నివిధాలా అనుకూలమే. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ అభి ప్రాయాలకు స్పందన లభిస్తుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు. ఆప్తులకు ధనసహాయం చేస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆహ్వానం అందు కుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. సోమవారం నాడు ఆచితూచి అడుగేయండి.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బల పడతాయి. మీ ఉన్నతి కొందరికి అపోహ కలి గిస్తుంది. కొత్త పనులు చేపడతారు. మంగళవారం నాడు అనవసర జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. కీలక పత్రాలు అందుకుంటారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా ఇబ్బంది లేకున్నా వెలితిగా ఉంటుంది. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. అతిగా ఆలోచించొద్దు. ఇష్టమైన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ప్రతి కూలతలు నిదానంగా చక్కబడతాయి. ఆత్మీ యులతో సంభాషణ ఉపశమనం కలిగి స్తుంది. మనోధైర్యంతో శ్రమిస్తారు. అవకాశా లను తక్షణం అందిపుచ్చుకోండి. పిల్లల చదు వులపై దృష్టిసారించండి గురువారం నాడు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఆచితూచి అడుగేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసు కోవద్దు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ము ఖులను చేస్తాయి. మొండిధైర్యంతోముందుకు సాగుతారు. ఇంటి విషయాలు పట్టించు కుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తుంటారు. పొదుపు ధనం అందుకుంటారు. వాహనం, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల ఆశీస్సులందుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. అందరి తోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మీ విజ్ఞత ఆకట్టుకుంటుంది. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. బంధుమిత్రుల రాక పోకలు అధికమవుతాయి. అనవసర బాధ్య తలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులను సంప్రదిస్తారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
కార్యం సిద్ధిస్తుంది. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. మీ కృషి ప్రశంస నీయమవుతుంది. ఆదాయానికి తగ్గటుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్తపనులు మొదలెడ తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చు కోండి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. మీ మాటతీరు అదుపులో ఉంచు కోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. మీ తప్పిదా లను సరిదిద్దుకోవటానికి యత్నించండి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్క లేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. శనివారం నాడు అందరి తోనూ మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్య లను కొందరు వక్రీకరిస్తారు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆత్మస్థైర్యంతో అడుగులేస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉం టుంది. ఆదాయం బాగుంటుంది. పెట్టుబడు లపై దృష్టి పెడతారు. ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియ చేయండి. సోమవారం నాడు పనులు హడా వుడిగా సాగుతాయి. చిన్న విషయానికే చికాకుపడతారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కార్యక్రమాలు విజయవం తమవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. వివాహ యత్నం ఫలిస్తుంది. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఆశలొది లేసుకున్న బాకీలు వసూలవుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. నోటీసులు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఏ విష యాన్నీ సమస్యగా భావించవద్దు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆపత్సమయంలో ఆత్మీయులు ఆదుకుంటారు. పనుల ప్రారం భంలో ఆటంకాలెదురవుతాయి. ఇంటి విష యాలు పట్టించుకుంటారు. పత్రాల రెన్యు వల్‌లో అలక్ష్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.