Share News

Panchagrahi Raja Yoga 2026: నూతన సంవత్సరం.. ఈ ఎఫెక్ట్‌తో ఈ రాశులకు రాజయోగం..

ABN , Publish Date - Dec 21 , 2025 | 07:02 PM

కొత్త ఏడాదిలో కొన్ని రాశులకు లక్ష్మీ కటాక్షం కలగనుంది. దీంతో వీరు గ్రహ స్థితులు మారిపోనున్నాయి.

Panchagrahi Raja Yoga 2026: నూతన సంవత్సరం.. ఈ ఎఫెక్ట్‌తో ఈ రాశులకు రాజయోగం..

Panchagrahi Raja Yoga: మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. కొన్ని రాశుల వారికి లక్ష్మీ కటాక్షం అనుగ్రహం కలగనుంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జనవరి 19వ తేదీ నుంచి ఊహించని ధనయోగం కలుగుతుంది. ఆర్థికంగా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి. జోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 13వ తేదీ నుంచి పంచగ్రహి రాజయోగం ఏర్పడనుంది. ఈ రోజు మకరరాశిలోకి శుక్రుడు ప్రవేశించడం.. ఆ తర్వాత సూర్యుడు, అంగారకుడు, బుధుడు, చంద్రుడు ఇలా కొన్ని గ్రహాలు మకర రాశిలో ఉండడం వల్ల శక్తివంతమైన పంచగ్రహి రాజయోగం ఏర్పడుతుంది. ఈ గ్రహ శభ ఫలితంగా జనవరి 19వ తేదీ నుంచి కొన్ని రాశులకు విశేషమైన లాభాలు కలగనున్నాయి.


ఈ రాశుల వారికి బిగ్ జాక్ పాట్

వృషభ రాశి

ఈ రాశి వారికి ఈ రాజయోగం వల్ల కెరీర్ పరంగా భారీ మార్పులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా వీరికి ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. అలాగే వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం సైతం బాగా పెరుగుతుంది. ఈ సమయంలో వీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.


మిథున రాశి..

ఈ రాశిలో జన్మించిన వారికి ఈ యోగం అద్బుతమైన అవకాశాలు కల్పి్స్తుంది. వ్యాపార పరంగా ఈ సమయం అత్యద్భుతం. పలు చోట్ల నిలిచిపోయిన నగదు తిరిగి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మంచి నెట్ వర్క్ పెంచుకొని భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు అందుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఉన్న ఎలాంటి సమస్యలైనా పూర్తిగా తొలగిపోతాయి.


కర్కాటక రాశి

ఈ రాశిలో జన్మించిన వారికి సమాజంలో గౌరవం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో సామాజిక హోదా సైతం పెరిగి.. పలు రకాలుగా లాభపడతారు. ప్రభుత్వ పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తులు మంచి పదోన్నతులు పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి అద్భుతమై మద్దతు లభిస్తోంది. కొత్త ప్రమోషన్స్ సైతం పొందుతారు.


సింహ రాశి

ఈ రాశి వారికి ఈ యోగం కారణంగా మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది. మానసిక సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కుటుంబంలో సమస్యలు పరిష్కార అయ్యే అవకాశాలున్నాయి. ఈ సమయంలో భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. అనుకున్నట్లుగా పనులు పూర్తి చేసి.. మంచి పేరు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


మీన రాశి..

ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభించనుంది. ఉద్యోగాలతోపాటు వ్యాపారాలు పరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి విశేషమైన లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది. కొన్ని పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారు.


ముఖ్య గమనిక: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య పండితులు చెప్పిన ఆధారంగా తీసుకొని రాసినవి మాత్రమే. వీటికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ధృవీకరించదు.

Updated Date - Dec 21 , 2025 | 07:04 PM