Share News

Dussehra 2025: దేశవ్యాప్తంగా ఘనంగా దసరా వేడుకలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?

ABN , Publish Date - Oct 02 , 2025 | 08:10 AM

దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నారు. అయితే, ఈ పండుగ సందర్భంగా ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Dussehra 2025: దేశవ్యాప్తంగా ఘనంగా దసరా వేడుకలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?
Dussehra 2025 Celebrations

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు ఆనందోత్సవాల నడుమ విజయదశమి వేడుకలు చేసుకున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాలలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు సందర్భంగా శమీ పూజ, ఆయుధ పూజ, వాహనాలకు పూజలు చేస్తున్నారు. ఒకరికొకరు జమ్మీ ఆకు ఇచ్చిపుచ్చుకుంటూ ఆత్మీయ ఆలింగానాలు చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో రావణాసురుని దహన కార్యక్రమాలకు అట్టహాసంగా ఏర్పాటు నిర్వహించారు. అయితే, దసరా రోజున ఏమి చేయాలో? ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..


ఏం చేయాలి?

  • ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి, ద్వారం ముందు ముగ్గులు వేసి అలంకరించాలి. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇలా చేయడం చాలా ముఖ్యం.

  • దసరా రోజున శ్రీరాముడిని, దుర్గాదేవిని భక్తితో పూజించండి. ఇంటి ఇలవేల్పుకు నైవేద్యం సమర్పించి, ఇంటిల్లిపాది ఆశీస్సులు తీసుకోండి.

  • దసరా నాడు దానాలు చేయడం అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. పేదవారికి లేదా బ్రాహ్మణులకు ఆహారం, డబ్బు, దుస్తులు దానం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఇంటి నుండి పేదరికం తొలగిపోయి శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు.


దసరా రోజున ఏం చేయకూడదు?

  • దసరా రోజున మాంసం, మద్యం, ఉల్లిపాయ-వెల్లుల్లి తినకూడదు.

  • ఏ జంతువు లేదా పక్షి హాని చేయకూడదు.

  • వృద్ధులను, స్త్రీలను, పేదలను అవమానించకూడదు.

  • ఇల్లు మురికిగా ఉంచకూడదు

  • పగటిపూట నిద్రపోకూడదు.

  • దసరా రోజున శుభ సమయం లేకుండా కొత్త పనులు ప్రారంభించకూడదు.

  • చిరిగిన, పాత బట్టలు, విరిగిన లేదా పదునైన వస్తువులను దానం చేయకూడదు.

  • సాయంత్రం వేళల్లో సూది, చక్కెర, ఉప్పు దానం చేయకూడదు. దసరా రోజున నల్లని బట్టలు కూడా ధరించకూడదు.


ఏమి కొనడం శుభప్రదం?

దసరా నాడు బంగారం, వెండి, వాహనాలు వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదం. ఈ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు వస్తుంది. ఇంకా, ఎలక్ట్రానిక్స్, ఇత్తడి కలశం కొనడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం, ఇంట్లో జమ్మి చెట్టు నాటడం కూడా శుభప్రదంగా ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంకు థ్యాంక్స్ చెప్పిన సీఎం

నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..

For More AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 08:10 AM