ఆ రాశివారికి ఈ వారం పెద్ద ఖర్చు తప్పదు..
ABN , Publish Date - Jun 22 , 2025 | 10:20 AM
ఆ రాశివారికి ఈ వారం పెద్ద ఖర్చు తప్పదని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయని తెలుసుతున్నారు. ఇంకా.. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారని తెలుపుతున్నారు.
అనుగ్రహం
22 - 28 జూన్ 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. లావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్త యత్నాలు మొదలెడతారు. సన్నిహితు లతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలో చింపచేస్తుంది. నిపుణులను సంప్రదిస్తారు. పెద్దల చొరవతో ఒక సమస్య సద్దుమణుగు తుంది. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. దూరప్రయాణం తలపెడతారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వద్దు. పొదుపు ధనం గ్రహిస్తారు. ఖర్చులు అధికం. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. స్థిరాస్తి వ్యవహారంపై దృష్టి పెడతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కొందరి రాక చికాకుపరుస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. ఫైనాన్స్, చిట్ప్ జోలికి పోవద్దు. గత అనుభవాలను గుర్తుచేసుకోండి. సన్నిహితులతో తరుచూ సంభాషిస్తారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. వాహన దారులకు కొత్త సమస్యలెదురవుతాయి.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహస్థితి నిరాశాజనకం. వ్యవ హారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయం తగదు. పెద్దల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. పనుల్లో జాప్యం, చికా కులు అధికం. కొంతమొత్తం ధనం అందు తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు.ఆచితూచి అడుగేయండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. దూరపు బంధుత్వాలు, పరిచయాలు బలపడ తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆహార నియమాలు తప్పకుండా పాటించండి.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
ఓర్పుతో శ్రమించండి. కార్యం సఫలమవుతుంది. సలహాలు, సాయం ఆశించ వద్దు. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్తయత్నాలు మొదలెడతారు. పెద్దల ఆశీస్సులుంటాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. లావా దేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆప్తులకు మీ సమస్యలు తెలియ జేయండి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. పాత పరిచయస్తులు తారసపడతారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. కలిసి వచ్చిన అవ కాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమా నాలు, అపోహలకు తావివ్వవద్దు. సావకా శంగా పనులు పూర్తిచేస్తారు. ఒకసమాచారం ఉత్తేజం కలిగిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ధన లాభం ఉంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కొంటారు.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
మీదైన రంగంలో మంచి ఫలితాలున్నాయి. ఓర్పుతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ కార్యదీక్ష ప్రముఖులను ఆక ట్టుకుంటుంది. పదవులు చేపడతారు. వ్యాప కాలు అధికమవుతాయి. తెగిపోయిన బంధు త్వాలు బలపడతాయి. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మీ ప్రమేయంతో ఒకరికి మేలు జరుగుతుంది. అతిగా శ్రమించవద్దు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
ఏకాగ్రత తగ్గకుండా చూసు కోండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ నిర్ణయం పైనే కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసు కుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తులు సాయం అందిస్తారు. రుణసమస్య తొలగుతుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశా లను తక్షణం అందిపుచ్చుకోండి. వ్యాఖ్యలు, విమర్శలు పట్టించుకోవద్దు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
గ్రహస్థితి సామాన్యం. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. దృఢసం కల్పంతో యత్నం సాగించండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆత్మీయులతో తరచూ సంభా షిస్తారు. అయినవారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టం మీద నెరవేరుతాయి. వివాదాస్పద విషయాల్లో జోక్యం తగదు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సంకల్ప బలంతోనే లక్ష్యం సాధిస్తారు. నిర్దిష్ట ప్రణాళి కలతో ముందుకు సాగుతారు. పనులు చురు కుగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచిం పచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపు తారు. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. పరి చయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం చేయండి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. పనులు మంద కొడిగా సాగుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. కొత్త పరిచయాలేర్పడతాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
సర్వత్రా అనుకూలమే. అప్ర యత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. పొరుగు వారి నుంచి అభ్యంతరాలుంటాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి.
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్
Read Latest Telangana News and National News