Share News

Chennai News: ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఆత్మహత్య

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:07 PM

స్థానిక తండయార్‌పేటలో ట్రాఫిక్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న శివకుమార్‌ ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శివకుమార్‌కు థెరిసా అనే భార్యా, గోపికా అనే కుమార్తె, మోనీస్‌ అనే కుమారుడు ఉన్నారు. సోమవారం ఉదయం ఇంటిలోని వారంతా బయటికి వెళ్లగా ఆయన తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Chennai News: ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఆత్మహత్య

చెన్నై: స్థానిక తండయార్‌పేటలో ట్రాఫిక్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న శివకుమార్‌(Shickumar) ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శివకుమార్‌కు థెరిసా అనే భార్యా, గోపికా అనే కుమార్తె, మోనీస్‌ అనే కుమారుడు ఉన్నారు. సోమవారం ఉదయం ఇంటిలోని వారంతా బయటికి వెళ్లగా ఆయన తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాపిల్లలు తిరిగొచ్చి చూడగా ఆయన ఉరివేసుకుని ఉండడంతో దిగ్ర్భాంతి చెందారు.


zzz.jpg

ఈ సంఘటన పై తండయార్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. పోలీసుల ప్రాథమిక విచారణలో శివకుమార్‌కు మద్యం అలవాటు ఉండేదని, ఈ విషయమై భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండేవారని, ఆ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడైంది. శివకుమార్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 26 , 2025 | 12:07 PM