Share News

Chennai News: చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మెడికోల మృతి

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:39 PM

తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి సముద్రతీర రహదారిలో మంగళవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యవిద్యార్థులు మృతి చెందారు. తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఓ కారులో వెళ్తుండగా ఉన్నట్టుండి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును డీకొంది.

Chennai News:  చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మెడికోల మృతి

చెన్నై: తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం తూత్తుకుడి సముద్రతీర రహదారిలో మంగళవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యవిద్యార్థులు మృతి చెందారు. తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఓ కారులో వెళ్తుండగా ఉన్నట్టుండి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును డీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యిం ది.


nani3.jpg

కారులో ప్రయాణించిన వైద్య విద్యార్థులు ముకిలన్‌, రాహుల్‌ సెబాస్టిన్‌, సారూబన్‌ అనే ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆ స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకుని పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాలను కారు శిథిలాల మధ్య నుండి వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించారు.


nani3,3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

మూగబోయిన మావోయిస్టుల కంచుకోట!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 20 , 2025 | 12:39 PM