Share News

Suryapet: రౌడీ షీటర్ దారుణ హత్య.. కులాంతర వివాహమే కారణమా..

ABN , Publish Date - Jan 27 , 2025 | 10:28 AM

సూర్యాపేట: మామిళ్లగడ్డ (Mamillagadda)కు చెందిన రౌడీ షీటర్ వడ్లకొండ కృష్ణ(Rowdy sheeter Krishna) దారుణ హత్యకు గురయ్యాడు. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రి(Pillalamarri)కి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై గుర్తుతెలియని దుండగులు అతన్ని హతమార్చారు.

Suryapet: రౌడీ షీటర్ దారుణ హత్య.. కులాంతర వివాహమే కారణమా..
Suryapet

సూర్యాపేట: మామిళ్లగడ్డ(Mamillagadda)కు చెందిన రౌడీ షీటర్ వడ్లకొండ కృష్ణ (Rowdy sheeter Krishna) దారుణ హత్యకు గురయ్యాడు. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రి(Pillalamarri)కి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై గుర్తుతెలియని దుండగులు అతన్ని హతమార్చారు. అతి కిరాతంగా బండరాళ్లతో తలపై మోది హత్య చేశారు. కృష్ణపై రౌడీ షీట్ ఉండగా.. 8 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆరు నెలల క్రితమే పిల్లలమర్రికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కులాంతర వివాహం చేసుకోవడం వల్లే హత్య జరిగినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న డీఎస్పీ రవి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Madhupriya shooting controversy: సింగర్ మధుప్రియ సాంగ్ షూటింగ్ వివాదం.. అధికారులపై వేటు..


అనంతరం బాధిత కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరువు హత్యనా లేక పాత కక్షలతో హత్య చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆరు నెలల క్రితమే వివాహం కావడంతో యువతి గుండెలు పగిలేలా రోదిస్తోంది. తల్లిదండ్రులను కాదని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న ఆరు మాసాల్లోనే అతను దూరం కావడంపై తీవ్ర విషాదంలో ముగినిపోయింది. కాగా, హత్య ఘటన జిల్లాలో పెను సంచలనంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్

Updated Date - Jan 27 , 2025 | 10:36 AM