Chennai: శ్రీరంగంలో రౌడీ దారుణహత్య..
ABN , Publish Date - Jan 29 , 2025 | 12:45 PM
తిరుచ్చి సమీపం శ్రీరంగం(Srirangam)లో పేరు మోసిన రౌడీ అన్బు (32)ను గుర్తు తెలియని దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి హత్యచేశారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటన కారణంగా శ్రీరంగం అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- కుటుంబసభ్యుల రాస్తారోకో
చెన్నై: తిరుచ్చి సమీపం శ్రీరంగం(Srirangam)లో పేరు మోసిన రౌడీ అన్బు (32)ను గుర్తు తెలియని దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి హత్యచేశారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటన కారణంగా శ్రీరంగం అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీరంగం మేలూరు రోడ్డు లక్ష్మీనగర్ ప్రాంతంలో నివసిస్తున్న అన్బు(Anbu)పై పలు పోలీసుస్టేషన్లలో హత్య, హత్యాయత్నం, దారిదోపిడీ, కట్ట పంచాయతీ కేసులున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: TNCC: గవర్నర్ పదవికి రవి అనర్హుడు..
ప్రముఖ పారిశ్రామికవేత్త రామజయం హత్యకేసులోను నిందితుడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 8.30 గంటలకు అన్బు జిమ్‌కు వెళ్ళి బైకుపై ఇంటికి తిరిగివస్తుండగా రెండు బైకుల్లో వెంబడించిన నలుగురు దుండగులు శ్రీరంగం తెప్పకుళం వద్ద చుట్టుముట్టి వేటకొడవళ్లు, కత్తులతో దాడి జరిపారు. దీంతో అన్బు తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో పడి కొన ఊపిరితో ఉండగా చికిత్స నిమిత్తం శ్రీరంగం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలో అతడు మరణించినట్లు ధ్రువీకరించారు.

ఈ సంఘటనగురించి తెలుసుకున్న అన్బు భార్య, కుటుంబ సభ్యులు శ్రీరంగం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గుమికూడి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. హత్య జరిగిన ప్రాంతం శ్రీరంగం రంగనాథస్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ ప్రాంతం కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య జరిగిన వెంటనే చాలా మంది భక్తులు తమ వాహనాలను అక్కడి తరలించేందుకు ఒకేసారి వచ్చారు. శ్రీరంగం పోలీసులు కేసు నమోదు చేసుకుని హంతకుల ఆచూకీకోసం గాలిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు
ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను
Read Latest Telangana News and National News