Share News

Hyderabad: ఫోన్‌ చేస్తే లొకేషన్‌ పంపుతారు.. స్పా ముసుగులో వ్యభిచారం

ABN , Publish Date - Jun 07 , 2025 | 08:21 AM

స్పా ముసుగులో వ్యభిచారం.. ఫోన్‌ చేస్తే లొకేషన్‌ పంపుతారు.. ఇదీ మన హైదరాబాద్‏లోని ఓ ఏరియాలో జరుగుతున్న హైటెక్ వ్యభిచారం దందా. నగరంలోని ఓ ప్రాంతంలో జరుగుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టురట్టైంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఫోన్‌ చేస్తే లొకేషన్‌ పంపుతారు.. స్పా ముసుగులో వ్యభిచారం

- పరారీలో నిర్వాహకులు.. ఐదుగురు కస్టమర్లు అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతోపాటు ఐదుగురు కస్టమర్లను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఓ మహిళను కాపాడారు. లింగంపల్లి శివనందిని అలియాస్‌ అంజలి, మద్దినేని సందీప్‌ కలిసి అమీర్‌పేట గురుద్వారా సమీపంలో ‘‘ఎన్‌ఎస్‌ బ్యూటీ సెలూన్‌ అండ్‌ స్పా’’ ఏర్పాటు చేశారు. వీరిద్దరూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో యువతులకు డబ్బు ఇచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. ఆదిలాబాద్‌ ఉట్నూర్‌ ప్రాంతానికి చెందిన నతారి సుధ(30) బాలానగర్‌లో ఉంటూ వీరు నిర్వహిస్తున్న స్పాలో పనిచేస్తుంది.


అంజలి, సందీప్‌ ఈమెకు నెలకు రూ. 25 వేల జీతం ఇచ్చి స్పాలో వసూళ్లు చేసేందుకు నియమించారు. అమ్మాయిలు కావాలని శివనందిని, సందీప్‌ను సంప్రదించిన కస్టమర్లకు సుధ ఫోన్‌ నెంబర్‌ ఇస్తారు. సుధ తనను సంప్రదించిన కస్టమర్లకు స్పా లొకేషన్‌ పంపుతుంది. వచ్చిన వారి నుంచి రూ.1,500 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తూ, మహిళలతో ఏకాంతంగా గడిపేందుకు సమయం కేటాయిస్తోంది.


స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచారంపై పక్కా సమాచారమందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కలిసి స్పా సెంటర్‌పై దాడి చేశారు. స్పాను నిర్వహిస్తున్న సుధతోపాటు సగిరాజు దినేష్‌వర్మ, గుడల గౌతమ్‌, నేనావత్‌ రవికుమార్‌, చవన్‌ సురేందర్‌, పిన్ని ప్రవీణ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి మహిళను కాపాడారు. స్పా నిర్వహిస్తున్న ప్రధాన నిందితులు శివనందిని, సందీప్‌ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన

Read Latest Telangana News and National News

Updated Date - Jun 09 , 2025 | 12:31 PM