Share News

Ooty, Chennai: పెరట్లో గంజాయి సాగు, ఇంట్లో జింకమాంసం

ABN , Publish Date - Sep 03 , 2025 | 10:48 AM

నీలగిరి జిల్లా ఊటీ సమీపం కీళ్‌ సేల్తా ప్రాంతంలో ఇంటి పెరట్లో గంజాయి సాగుచేస్తూ, ఇంటిలోపల, ఎండిన జింక మాంసాన్ని దాచిన కన్నన్‌ (64) అనే వృద్ధుడిని అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు.

Ooty, Chennai: పెరట్లో గంజాయి సాగు, ఇంట్లో జింకమాంసం

- ఊటీలో వృద్ధుడి అరెస్టు

చెన్నై: నీలగిరి జిల్లా ఊటీ(Ooty) సమీపం కీళ్‌ సేల్తా ప్రాంతంలో ఇంటి పెరట్లో గంజాయి సాగుచేస్తూ, ఇంటిలోపల, ఎండిన జింక మాంసాన్ని దాచిన కన్నన్‌ (64) అనే వృద్ధుడిని అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఆ వృద్ధుడి ఇంటి చుట్టుపక్కల నివసిస్తున్నవారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కీల్‌సేల్తా ప్రాంతంలోని ఇంటి వద్ద అటవీ శాఖ(Forest Department) అధికారులు మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు జరిపారు.


nani2.2.jpg

ఆ ఇంటి పెరట్లో సాగవుతున్న గంజాయి కనుగొన్నారు. ఇంటిలోపల సోదా చేయగా, ఓ గోనె సంచిలో ఉన్న ఎండిన జింక మాంసం, ఎముకలు, 300 గ్రాముల గంజాయి పట్టుబడింది. వెంటనే కన్నన్‌ను అరెస్టు చేసి తెన్నాడుకెంపై పోలీసుస్టేషన్‌కు తరలించారు.


nani2.3.jfif

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 03 , 2025 | 10:48 AM