Share News

Hyderabad: సిలిండర్‌తో కొట్టి యువకుడి దారుణ హత్య

ABN , Publish Date - May 31 , 2025 | 10:40 AM

ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ చివరుకు కక్షల వరకు వెళ్లి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది. తన భార్యతో విడాకుల విషయంలో వీరి పాత్ర ఉందన్న అనుమానం పెంచుకుని ప్రాణాలు తీయడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక వివరాల్లోకి వెళితే..

Hyderabad: సిలిండర్‌తో కొట్టి యువకుడి దారుణ హత్య

- ఇద్దరు స్నేహితులపై హత్యాయత్నం

- మరొకరు తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు

- భార్యతో విడాకుల విషయంలో వీరి పాత్రపై అనుమానం

- పోలీసుల అదుపులో నిందితుడు

హైదరాబాద్: తన నుంచి భార్య విడాకులు తీసుకునేందుకు కారణమయ్యారని ఇద్దరు స్నేహితులపై కక్ష కట్టాడు. మద్యంమత్తులో వారిని చంపాలని యత్నించగా ఒకరు చనిపోగా, మరొకరు తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజాము రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బుద్వేల్‌లో జరిగింది. ఎస్‌ఐ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం.. కడప కు చెందిన సిద్దారెడ్డి(30) ఓ క్యాబ్‌ డ్రైవర్‌. బుద్వేల్‌లో నివాసం ఉంటున్నాడు. పక్కనే వరంగల్‌(Warangal)కు చెందిన పైడిపాల సాయి కార్తీక్‌(31), నవీన్‌ (28)లు నివసిస్తున్నారు.


ముగ్గురు స్నేహంగా ఉండేవారు. ఆరేళ్ల క్రితం సిద్దారెడ్డి నుంచి భార్య విడాకులు తీసుకుంది. దానికి కారణం ఇద్దరు మిత్రలేనని అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో రూ.8 లక్షలను సిద్దారెడ్డి వద్ద కార్తీక్‌ తీసుకున్నాడు. గురువారం రాత్రి సాయి కార్తీక్‌ నివాసంలో ముగ్గురు కలిసి మద్యం తాగారు. ఆతర్వాత సిద్దారెడ్డి తనకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి అడిగాడు. గొడవ జరిగింది. నవీన్‌ బయటకు వెళ్లగా, మరోసారి గొడవ పడ్డారు.


ఆ సమయంలో మినీ గ్యాస్‌ సిలిండర్‌ తో సాయి కార్తీక్‌పై దాడి చేయగా అక్కడిక్కడే మృతిచెందాడు. మరలా లోపలికి వచ్చిన నవీన్‌... కార్తీక్‌ మరణించి ఉండటాన్ని చూసి అరిచాడు. అతడిని కూడా చంపాలని సిద్దారెడ్డి చూడగా బయటకు పరుగులు తీసి చుట్టుపక్కల వారికి తెలిపి, పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సిద్దారెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ క్యాస్ట్రో తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు

వరంగల్‌లో ఉగ్ర కలకలం!

Read Latest Telangana News and National News

Updated Date - May 31 , 2025 | 10:48 AM