Hyderabad: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం.. ఆపై ప్రేమ.. చివరకు ఏమైందంటే..
ABN , Publish Date - Apr 24 , 2025 | 07:13 AM
ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ.. ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- నిందితుడిపై కేసు నమోదు
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిపై యువతి ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు(SR Nagar Police) ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీ రాష్ట్రం ఒంగోలు(Ongole) సమీపంలోని రాజంపల్లికి చెందిన దార్ల మురళి(33) సంవత్సరం క్రితం నగరానికి వచ్చి ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్ పాఠశాలలో పీఈటీ టీచర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Gold Price Falls: లక్ష దిగువకు బంగారం

బజాజ్ షోరూంలో ఉద్యోగం చేస్తున్న అనంతపురం(Anantapur) జిల్లాకు చెందిన యువతితో అప్పటి నుంచే ఇన్‌స్ట్రాగామ్‌లో(Instagram) పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నెల క్రితం ఇద్దరి మధ్య పెళ్లి మాట రాగానే ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశాడు. ఇక మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
ముగ్గురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య
ఫినాయిల్, సబ్బుల పైసలు నొక్కేశారు
Read Latest Telangana News and National News