Chennai News: కత్తులు సాన పెడతామంటూ వచ్చి పిల్లల కిడ్నాప్ యత్నం..
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:28 PM
చిన్నపిల్లలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన యువవుడిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- బిహార్ వాసి అరెస్ట్
తిరువళ్లూర్(చెన్నై): పిల్లలను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన బిహార్(Bihar) రాష్ట్రానికి చెందిన యువకుడిని స్థానికులు బంధించారు. తిరువళ్లూర్ వీఎం నగర్ ప్రాంతానికి చెందిన జయ ఆనంద్‌రాజ్-రాసత్తి దంపతులకు యోగేష్ రాజ్(8), కనిష్ రాజ్ (10) అనే కుమారులున్నారు. మంగళవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలను గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. పిల్లల కేకలకు అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు ఇరుగుపొరుగు వారి సాయంతో ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు అక్కడకు చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను బిహార్ రాష్ట్రానికి చెందిన రస్తం కుమార్ అని, బెలూన్లు విక్రయం, కత్తులకు సాన పెట్టడం తదితరాలు చేస్తుంటాడని, ఘటన జరిగిన రోజున అతను గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
Read Latest Telangana News and National News