Bengaluru: కామెడీ కిలాడీ నటుడు మనుపై అత్యాచారం కేసు
ABN , Publish Date - May 23 , 2025 | 12:37 PM
కన్నడ నటుడు మడనూరు మనుపై పోలీసులు అత్యాచారం, దాడితోపాటు ప్రాణాలు తీస్తామనే బెదిరింపుల కేసు నమోదు చేశారు. మరో నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బెంగళూరు: కన్నడలో పేరొందిన ‘కామెడీ కిలాడిగళు’ కార్యక్రమం నటుడు మడనూరు మనుపై అత్యాచారం, దాడితోపాటు ప్రాణాలు తీస్తామనే బెదిరింపుల కేసు నమోదు చేశారు. తోటి నటి ఫిర్యాదుకు అనుగుణంగా కేసు నమోదు చేశారు. బెంగళూరు(Bengaluru) అన్నపూర్ణేశ్వరీ నగర్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కామెడీ కిలాడిగళు అనే ప్రదర్శన హస్యభరితంగా ప్రజాదరణ కలిగి ఉంది. ఇలా షో ద్వారా పేరొందిన మడనూరు మను కులదల్లి కీళ్యావుదో అనే సినిమా హీరోగాను నటించారు.
శుక్రవారం సదరు సినిమా విడుదల కావాల్సి ఉంది. సహనటి ఒకరు అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 2018 నుంచి మను సహనటుడిగా సన్నిహితంగా ఉండేవారని పేర్కొన్నారు. కామెడీ కిలాడిగళు షో ద్వారా మరింత స్నేహితులైనట్లు పేర్కొన్నారు. 2022 నవంబరు29న శివమొగ్గలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు పారితోషికం ఇచ్చేందుకు ఇంటికి పిలిచారన్నారు. అక్కడే అత్యాచారానికి పాల్పడ్డారని ఇదే ఏడాది డిసెంబరు 3న తన ఇంటికి వచ్చి బలవంతంగా తాళి కట్టినట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు.

పలుమార్లు ఇష్టం లేకున్నా అత్యాచారానికి పాల్పడ్డారని, రెండుసార్లు గర్భస్రావం కూడా చేయించారన్నారు. నాగరబావిలో ఓ ఇంట్లో ఉంచారని లైంగిక దాడికి సంబంధించి మొబైల్‌లో రికార్డు చేసుకుని ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. న్యాయం చేయాలని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తదుపరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది బుల్లితెర, శాండిల్‌వుడ్ రంగంలో ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి.
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
సీఎం ఓఎస్‌డీని అంటూ మెయిల్స్, కాల్స్
Read Latest Telangana News and National News