Chennai: నగరంలో.. మళ్లీ ‘బైక్ రేస్’
ABN , Publish Date - May 27 , 2025 | 12:24 PM
రాజధాని నగరం చెన్నై శివారు కోయంబేడులో బైక్ రేసింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కొందరు యువకులు అర్ధరాత్రి 12 గంటల తరువాత ఓ ప్రాంతానికి చేరిన యువకులు ఈ బైక్ రేసింగ్ నిర్వహించినట్లు సమాచారం.
చెన్నై: నగరంలో ప్రజలను భయభ్రాంతులను చేసేలా, ప్రమాదాలకు తావిచ్చేలా ‘బైక్ రేస్’లు మళ్లీ ప్రారంభం కావడం కలకలం రేపుతోంది. ఆదివారం అర్ధరాత్రి కోయంబేడు(Koyambedu) నుంచి అడయార్ వరకు సుమారు పది మందికి పైగా యువకులు బైక్ రేస్‌లో పాల్గొన్నారు. అతివేగంగా, రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్తున్న బైక్‌లను చూసి వాహనచోదకులు బెంబేలెత్తిపోయారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని అర్ధరాత్రి 12 గంటల తరువాత ఓ ప్రాంతానికి చేరిన యువకులు, ఒంటి గంట తర్వాత రేస్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా, 10 కి.మీ దూరాన్ని మూడు నిమిషాల్లో చేరుకోవాలి, బైక్ వేగం 120 నుంచి 130 కి.మీ పైగా ఉండాలి సహా పలు ప్రమాదకర నిబంధనలతో ఈ రేస్ నిర్వహించారు. విజేతలకు రూ.20 వేలు బహుమతిగా నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, బైక్ ప్రారంభం నుంచి ముగిసే వరకు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష్య ప్రసారం చేయడం ఆందోళన కలిగించింది. ఈ విషయమై ట్రాఫిక్ విభాగం అధికారి ఒకరు మాట్లాడుతూ... బైక్ రేస్‌లో పాల్గొన్న వాహనాలకు రిజిస్ట్రేషన్ నెంబరు ప్లేట్లు లేవన్నారు.

అయినా, ట్రాఫిక్ విజిలెన్స్ పోలీసులు, రేస్‌ల్లో పాల్గొన్న యువకులను గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిపారు. కోయంబేడు-అడయార్ వరకు ఉన్న సీసీ ఫుటేజీ పరిశీలించామని, అన్నానగర్‌కు చెందిన ఐదుగురిని గుర్తించి, వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. రేస్‌లకు పాల్పడిన వారికి తలా రూ.10వేల జరిమానా విధించడంతో పాటు కోర్టులో హజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!
Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి
Read Latest Telangana News and National News