Share News

Hyderabad: తాళం వేసి ఉంటే చాలు.. ఇక అతనికి..

ABN , Publish Date - May 30 , 2025 | 10:48 AM

ఇంటికి తాళం వేసి ఉంటే చాలు.. ఇక అతనికి పండగే. నగరం, శివారు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: తాళం వేసి ఉంటే చాలు.. ఇక అతనికి..

- ఘరానా దొంగ అరెస్ట్‌

- చోరీ సొత్తుతో జల్సాలు, బెట్టింగ్‌లు, డైలీ ఫైనాన్స్‌

- రూ. 20 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌ చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పహాడిషరీఫ్‌(Pahadishareef) పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎల్బీనగర్‌ క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ గాజులపేటకు చెందిన అల్లం శివ(27) కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి అంబర్‌పేట బతుకమ్మకుంటలో ఉంటున్నాడు.


ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, మద్యం, గంజాయికి అలవాటుపడ్డ ఇతడు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌ చేసి, చోరీలు చేశాడు. వ్యసనాలతోపాటు విలాసాల కోసం ఇతడు చోరీల బాటపట్టాడు. అంబర్‌పేట్‌, వెల్దండ, ఉర్కొండ, మిడ్జిల్‌, మంచాల, కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో 9దొంగతనాలు చేశాడు. ఈ కేసుల్లో పోలీసులు శివను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి 2024 అక్టోబర్‌లో విడుదలైన ఇతడు డైలీ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. బెట్టింగ్‌లకు, వ్యసనాలకు డబ్బు సరిపోకపోవడంతో తిరిగి చోరీలు చేయడం ప్రారంభించాడు.


city5.2.jpg

పహాడిషరీఫ్‌ పోలీస్టేషన్‌, హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఏడు ఇళ్లలో చోరీలు చేశాడు. చోరీ చేసిన అనంతరం కేటీఎం బైక్‌పై పరారయ్యేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పహాడిషరీఫ్‌ పోలీసులు నిందితుడిని గుర్తించారు. చోరీ సొత్తును విక్రయించే ప్రయత్నంలో ఉండగా కాపుకాసిన పోలీసులు షాలిబండ క్రాస్‌రోడ్స్‌ వద్ద నిందితుడు శివను గుర్తించి అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన 13 తులాల బంగారు నగలు, 41 తులాల వెండి నగలు, రూ. 50వేలు, కేటీఎం బైక్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లను స్వాధీనం చేసుకున్నా రు. చోరీ కేసులు ఛేదించిన పోలీసులను సీపీ అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates In India on May 30: నేడూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Fee Reimbursement: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు 75 శాతం హాజ‌రు తప్పనిసరి

Read Latest Telangana News and National News

Updated Date - May 30 , 2025 | 10:48 AM