Share News

Hyderabad: అనుమానం పెనుభూతమై.. భార్యను హతమార్చిన భర్త

ABN , Publish Date - Jun 11 , 2025 | 07:34 AM

దంపతులిద్దరి మధ్య తలెత్తిన అనుమానం భార్య హత్యకు దారితీసింది. ఈ సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా, తొండంగి మండలం, కొమ్మనపల్లి గ్రామానికి చెందిన మరియదాసు(35), అమ్ములు (30) దంపతులు.

Hyderabad: అనుమానం పెనుభూతమై.. భార్యను హతమార్చిన భర్త

హైదరాబాద్: దంపతులిద్దరి మధ్య తలెత్తిన అనుమానం భార్య హత్యకు దారితీసింది. ఈ సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌(Saroornagar Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా, తొండంగి(Thondangi) మండలం, కొమ్మనపల్లి గ్రామానికి చెందిన మరియదాసు(35), అమ్ములు (30) దంపతులు. వీరికి 2013లో వివాహం అయింది. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు.


కుమార్తె అశ్విని(11), కుమారుడు నితిన్‌(7)తో కలిసి సరూర్‌నగర్‌ భాగ్యనగర్‌ కాలనీలో నివసిస్తున్నారు. కొద్ది రోజులుగా భార్యాభర్తలిద్దరూ ఒకరిపై మరొకరికి అక్రమ సంబంధాలున్నాయన్న అనుమానంతో గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మరియదాసు భార్య అమ్ములుతో గొడవ పడ్డాడు. మంగళవారం ఉదయం బయటకు వెళ్లి వచ్చిన అతడు ఫోన్‌ ఎవరితో మాట్లాడుతున్నావంటూ భార్యతో గొడవపడి కొట్టాడు.


city2.2.jpg

ఆగ్రహంతో చున్నీతో గొంతు బిగించి హతమార్చాడు. అనంతరం ఎదురింట్లో నివసించే అమ్ములు తండ్రి అర్జునకు ఫోన్‌ చేసి గొడవపడ్డామని సమాచారం ఇచ్చి వెళ్లిపోయాడు. అర్జున వచ్చి చూడగా అమ్ములు చనిపోయింది. వెంటనే సరూర్‌నగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మరియదా్‌సును అదుపులోకి తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 11 , 2025 | 07:34 AM