Share News

Hyderabad: ఢిల్లీ, గోవా నుంచి మద్యం అక్రమ రవాణా..

ABN , Publish Date - Oct 11 , 2025 | 10:36 AM

ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమగా మద్యం రవాణా చేస్తున్న ముఠాను ఎక్సైజ్‌ సిబ్బంది అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ. 8 లక్షల విలువైన 198 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: ఢిల్లీ, గోవా నుంచి మద్యం అక్రమ రవాణా..

- రూ. 8 లక్షల విలువైన మద్యం స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమగా మద్యం రవాణా చేస్తున్న ముఠాను ఎక్సైజ్‌ సిబ్బంది అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ. 8 లక్షల విలువైన 198 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి నాన్‌ డ్యూటీ పెయిడ్‌(Non Duty Paid) లిక్కర్‌ సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో రంగారెడ్డి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎస్‌టీఎఫ్‌ బృందాలు పహాడిషరీప్‌ ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహించాయి.


city7.jpg

ఈతనిఖీల్లో పలువాహనాల్లో తరలిస్తున్న రూ. 8లక్షల విలువైన 198 మద్యం బాటిళ్ల ను ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకొని నిందితులపై కేసులు నమోదు చేశారు. విమానాలు, బస్సులు, కార్లలో గోవా, ఢిల్లీ నుంచి మద్యం బాటిళ్లు నగరానికి తరలిస్తున్నారని ఎక్సైజ్‌ ఏఈఎస్‌ జీవన్‌ కిరణ్‌ తెలిపారు. భారీ మొత్తంలో మద్యం బాటిళ్లు పట్టుకున్న రంగారెడ్డి ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లు సుభాష్‌ చందర్‌రావు, బాలరాజు, ఎస్సైలు వెంకటేశ్వర్లు, రవి, అఖిల్‌, సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసిం, రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌ దశరథ్‌ అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2025 | 10:36 AM