Share News

Hyderabad: నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆర్థిక ఇబ్బందులు..

ABN , Publish Date - Jul 18 , 2025 | 08:02 AM

ఆర్థిక ఇబ్బందులతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, బిల్డర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్‌ ప్రశాంత్‌హిల్స్‌ కాలనీలో చెందిన మర్రి వెంకటేశ్వర్లు(47) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.

Hyderabad: నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆర్థిక ఇబ్బందులు..

- ఉరేసుకొని బిల్డర్‌ ఆత్మహత్య

హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, బిల్డర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌(Vanasthalipuram Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్‌ ప్రశాంత్‌హిల్స్‌ కాలనీలో చెందిన మర్రి వెంకటేశ్వర్లు(47) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. కొంతకాలంగా అతను రియల్‌ ఎస్టేట్‌తో పాటు బిల్డర్‌గానూ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.


ఇటీవల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో అతను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంజాపూర్‌లోని సాయిప్రియ కాలనీలో ఉన్న ఫ్లాట్‌లోని గదిలో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విగతజీవిగా యజవనిఇ కనబడటం చూసిన వెంకటేశ్వర్లు సూపర్‌వైజర్‌ బి.రాజు పోలీసులతో పాటు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.


city2.2.jpg

పోలీసులు.. స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది. తాను ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడు సూసైడ్‌ నోట్‌లో రాసినట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..

బీఆర్‌ఎస్‌ నా దారిలోకి రావాల్సిందే..

Updated Date - Jul 18 , 2025 | 08:02 AM