Bengaluru: అడ్డుకున్నాడు.. అరెస్టయ్యాడు..
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:51 PM
తన వెకిలి చేష్టలతో బస్సు ప్రయాణాన్ని అడ్డుకున్న యువకుడు కటకటాలపాలయ్యాడు. కురుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బైలూరు గ్రామానికి చెందిన ప్రకాష్ అనే యువకుడిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

- బస్సు ప్రయాణానికి ఇబ్బంది కలిగించిన యువకుడుఫ వీడియో వైరల్
- అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు: తన వెకిలి చేష్టలతో బస్సు ప్రయాణాన్ని అడ్డుకున్న యువకుడు కటకటాలపాలయ్యాడు. కురుగోడు పోలీస్ స్టేషన్(Kurugod Police Station) పరిధిలోని బైలూరు గ్రామానికి చెందిన ప్రకాష్ అనే యువకుడిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కురుగోడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు రెండు రోజులు క్రితం బళ్లారి, సిరుగుప్ప(Bellary, Siruguppa) రోడ్డులో లక్ష్మీనగర్‌క్యాంప్ నుంచి బైలూరు గ్రామానికి చెందిన ప్రకాష్ బళ్లారి నుంచి సిరుగుప్ప వైపు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఇబ్బంది కలిగించాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hero Vishal: హీరో విశాల్ ప్రశ్న.. విజయ్ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..
బస్సు ముందు భాగంలో ద్విచక్రవాహనంపై డ్రైవింగ్ చేస్తూ బస్సుకు సైడ్ ఇవ్వకుండా రెండు కిలో మీటర్లు ప్రయాణం చేశాడు. అయితే ఈ దృశ్యాన్ని బస్సు ప్రయాణికులు కొందరు మొబైల్‌లో చిత్రీకరించి వైరల్ చేశారు. ఈ వీడియోను కురుగోడు ఎస్‌ఐ సుప్రీత్ పరిశీలించి, ద్విచక్రవాహనం నెంబర్ ఆధారంగా యువకుడిని గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రయాణికులను ఇబ్బంది కలిగించినందుకు అరెస్ట్ చేశామన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు
ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్ పార్కులు
ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!
ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం
Read Latest Telangana News and National News