Hyderabad: పెళ్లి పేరుతో యువతిని నిర్భందించి.. ఆపై
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:07 AM
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని నిర్భందించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ పగరంలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఓ యువతి శ్రీనగర్ కాలనీలోని ఓ సౌండ్ లాబ్స్‌లో పనిచేస్తోంది. అయితే.. శేషు మోహన్ తురగా అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి యువతిని రెండు రోజుల పాటు నిర్భందించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదైంది. నగరానికి చెందిన ఓ యువతి శ్రీనగర్ కాలనీలోని ఓ సౌండ్ లాబ్స్‌లో పనిచేస్తోంది. 2024 అక్టోబర్‌లో శేషు మోహన్ తురగాతో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల పాటు ఇద్దరూ స్నేహంగా ఉ న్నారు. అనంతరం శేషు ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. మొదట యువతి నిరాకరించింది. చివరకు ఇద్దరూ ప్రేమలోపడ్డారు. పెళ్లి చేసుకుందాని ప్రతిపాదించుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆస్తి కోసం కుమార్తెను చంపిన సవతి తల్లి
ఇదే విషయాన్ని ఇద్దరూ తమ కుటుంబ సభ్యులకు చెప్పారు. శేషు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. యువతి ఇంట్లో తల్లి, అమ్మమ్మ ఒప్పుకోగా, తండ్రి మాత్రం విభేదించాడు. ఇంటి నుంచి యువతిని బయటకు పంపించేశాడు. దీంతో ఆమె శేషుకు ఫోన్ చేసి తనను తీసుకువెళ్లాలని కోరింది. ఈ నెల 4న యువతిని స్టూడియోకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను ఓ గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అనంతరం అక్కడే నిర్భందించి మానసికంగా, శారీరకంగా హింసించాడు. జాతకాలు కలవడం లేదని పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఆమె బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. అతను లేని సమయంలో యువతి డయల్ 100 ఫోన్ చేసి పోలీసుల సహాయంతో బయటకు వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు శేషుపై బి ఎం ఎస్ 69 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
ఒక్క క్లిక్‌తో స్థలాల సమస్త సమాచారం!
రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్
Read Latest Telangana News and National News