Chennai: ఆయువు తీసిన అవమానం..
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:04 PM
తమిళనాడులోని దిండుగల్ జిల్లా చిన్న కుళిపట్టి గ్రామంలో ఓ మహిళ భర్తను వదిలేసి, పరాయి వ్యక్తితో వెళ్లిపోవడాన్ని అవమానంగా భావించిన ఆమె కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా.. చిన్న కుళిపట్టి గ్రామంలోని ఓ ఇంటిలోచెల్లమ్మాళ్ (65), ఆమె కుమార్తె కాళీశ్వరి (45) నివసిస్తున్నారు.
- ఒకే కుటుంబానికి చెందిన నలుగురి బలవన్మరణం
చెన్నై: దిండుగల్(Dundigal) జిల్లా చిన్న కుళిపట్టి గ్రామంలో ఓ మహిళ భర్తను వదిలేసి, పరాయి వ్యక్తితో వెళ్లిపోవడాన్ని అవమానంగా భావించిన ఆమె కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా.. చిన్న కుళిపట్టి గ్రామంలోని ఓ ఇంటిలోచెల్లమ్మాళ్ (65), ఆమె కుమార్తె కాళీశ్వరి (45) నివసిస్తున్నారు. కాళీశ్వరి కుమార్తె పవిత్ర (28)కు కరూరు జిల్లాకు చెందిన ప్రభాకరన్ అనే యువకుడితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమై, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ నేపథ్యంలో భర్తతో ఘర్షణ పడిన పవిత్ర.. తన బిడ్డలతో సహా నెల రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది.
ఈ నేపథ్యంలో పళ్లపట్టికి చెందిన ఓ యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో పవిత్ర మంగళవారం సాయంత్రం తన ఇద్దరు కుమార్తెలను వదిలి ఆ యువకుడితో పరారైంది. ఈ విషయం తెలుసుకున్న పవిత్ర తల్లి కాళీశ్వరి, బామ్మ చెల్లమ్మాళ్ అవమానభారంతో క్రుంగిపోయారు. ఆ తర్వాత మంగళవారం రాత్రి చెల్లమ్మాళ్ తన కుమార్తె కాళీశ్వరి, ఆమె మనవరాళ్లు లితిక (7), దీప్తి (5)కి విషమిచ్చి హతమార్చింది. అనంతరం తానూ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

బుధవారం ఉదయం చెల్లమ్మాళ్ ఇంటి నుండి ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో చుట్టుపక్కలవారు వెళ్ళి చూడగా కాళీశ్వరి, ఆమె మనవరాళ్లు నురగలు కక్కుకుని నేలపై శవాలుగా పడి ఉండటం, చెల్లమ్మాళ్ శవంగా వేలాడుతుండం చూసి దిగ్ర్భాంతి చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇడయైుకోట పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నివాసం కోసం దిండుగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం
ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే
Read Latest Telangana News and National News