Share News

Hyderabad: బోయినపల్లిలో దొంగ అఘోరాల హల్‌చల్‌..

ABN , Publish Date - Jul 15 , 2025 | 10:23 AM

రాయల్‌ ఎన్‌క్లేవ్‌లోని అయప్ప శబరి తీర్థం దేవాలయం వద్ద సోమవారం దొంగ అఘోరాలు హల్‌చల్‌ చేశారు. ఆలయ పునర్‌నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం గర్భగుడి నిర్మాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ తెల్లరంగు కారు వచ్చి అక్కడ ఆగింది.

Hyderabad: బోయినపల్లిలో దొంగ అఘోరాల హల్‌చల్‌..

- పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పరార్‌

హైదరాబాద్: రాయల్‌ ఎన్‌క్లేవ్‌లోని అయప్ప శబరి తీర్థం దేవాలయం వద్ద సోమవారం దొంగ అఘోరాలు హల్‌చల్‌ చేశారు. ఆలయ పునర్‌నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం గర్భగుడి నిర్మాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ తెల్లరంగు కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి అఘోరాల వేషధారణలో ఉన్న ఇద్దరు, బాబాల వేషధారణలో ఉన్న ఐదుగురు దిగి ఆలయం లోపలికి వెళ్లారు. హిందీలో ఏవో మంత్రాలు చదువుతూ ఆలయ పూజారి, భక్తులను అయోమయానికి గురిచేశారు.


వారి వింత చేష్టలను గమనించిన పూజారులు శ్రీకేష్‌, మధు విషయాన్ని అక్కడే ఉన్న ఆలయ ఫౌండర్‌ చైర్మన్‌ కపిల్‌ బరాబరికి తెలిపారు. ఏ పూజలు చేస్తారని ఆయన వారిని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారనగా.. చార్‌ధామ్‌ యాత్ర చేస్తున్నామని చెప్పారు. చార్‌ధామ అంటే ఏమిటని ఆయన అడగగా.. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ చెప్పారు.


దీంతో వారు నిజమైన అఘోరాలు కాదని నిర్ధారణకు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పారిపోయారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి శ్రీకేష్‌ మాట్లాడుతూ మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్న దొంగ అఘోరాలు, బాబాలతో అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య

Read Latest Telangana News and National News

Updated Date - Jul 15 , 2025 | 10:23 AM