Share News

Hyderabad: డమ్మీ హెలీకాప్టర్‌ దగ్ధం..

ABN , Publish Date - Jun 21 , 2025 | 10:32 AM

సినిమా షూటింగ్‌ కోసం తయారు చేసిన డమ్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పక్కనే పైలెట్‌ శిక్షణ కేంద్రం ఉండడంతో నిజమైన హెలికాప్టర్‌గానీ, శిక్షణ విమానం(చాపర్‌)గానీ కూలి ఉంటుందంటూ స్థానికంగా ప్రచారం జరిగింది.

Hyderabad: డమ్మీ హెలీకాప్టర్‌ దగ్ధం..

- సినిమా షూటింగ్‌ కోసం తయారీ

హైదరాబాద్: సినిమా షూటింగ్‌ కోసం తయారు చేసిన డమ్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పక్కనే పైలెట్‌ శిక్షణ కేంద్రం ఉండడంతో నిజమైన హెలికాప్టర్‌గానీ, శిక్షణ విమానం(చాపర్‌)గానీ కూలి ఉంటుందంటూ స్థానికంగా ప్రచారం జరిగింది. గుర్రంగూడకు చెందిన వార్డు మాజీ సభ్యుడొకరు తన కుమారుడిని హీరోగా పెట్టి ఓ సినిమా తీస్తున్నారు.


మూడేళ్ల క్రితం షూటింగ్‌ నిమిత్తం పోచమ్మగుడి(Pochmma Gudi) వెనుక మైదానంలో డమ్మీ హెలికాప్టర్‌ను తయారు చేసి పెట్టారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా షూటింగ్‌ ఆగిపోగా.. సదరు డమ్మీ హెలికాప్టర్‌ మందుబాబులకు అడ్డాగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు అందులో కూర్చుని మద్యం తాగుతున్నారు.


city1.2.jpg

అనంతరం సిగరెట్‌ వెలిగించి అక్కడే పడేసి వెళ్లినట్టు తెలిసింది. దాని చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోవడంతో సిగరెట్‌ పీక కారణంగా మంటలు అంటుకొని హెలికాప్టర్‌ దగ్ధమయింది. స్థానికులు గమనించి మంటలను ఆర్పివేశారు. మీర్‌పేట పోలీసులు(Meerpet Police) ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నీటి రక్షణకు కుట్టి రోబోలు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 21 , 2025 | 10:32 AM