Share News

Dharmavaram Minor Girl Incident: బాలికపై పెంపుడు తండ్రి అత్యాచారం

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:53 PM

ధర్మవరం పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని నెలలుగా 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి, అతని బావమరిది అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటకొచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో కేసు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.

Dharmavaram Minor Girl Incident: బాలికపై పెంపుడు తండ్రి అత్యాచారం
Dharmavaram Case

శ్రీసత్యసాయి జిల్లా, డిసెంబర్ 01: ధర్మవరం(Dharmavaram) పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని నెలలుగా 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి, అతని బావమరిది అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటకొచ్చింది. ధర్మవరంలో ఉండే ఓ జంట 14 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయ ప్రాంతం నుంచి ఓ ఆడ శిశువును తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆ బాలిక వయస్సు 14 ఏళ్లు. ఈ క్రమంలో బాలికపై పెంపుడు తండ్రి(foster father rape case), అతని బావమరిది కన్నేశారు. ఇద్దరూ బాలికపై తరచూ అత్యాచారం చేస్తూ ఎవరికీ చెప్పకూడదని బెదిరించారు.


ఆదివారం బాలిక అనారోగ్యానికి గురికావడంతో పెంపుడు తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు.. ఆమె గర్భం(girl pregnant) దాల్చిందని, ప్రస్తుతం ఐదు నెలలని తెలిపారు. తన సోదరుడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని భావించిన బాలిక పెంపుడు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను డీఎస్పీ హేమంత్‌కుమార్‌ విచారించారు. పెంపుడు తండ్రి, అతని బావమరిది అత్యాచారం చేశారని విచారణలో బాలిక తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరి పైనా పోక్సో కేసు( POCSO case) నమోదుచేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

తుస్సుమన్న జగన్ ప్లాన్.. పీపీపీపై వైసీపీ నేతలు రివర్స్

ఉదయం 9 గంటలకే 62.40 శాతం పింఛన్ల పంపిణీ

Updated Date - Dec 01 , 2025 | 01:10 PM