Share News

Delivery Agent Attack: ఫుడ్ డెలివరీ బాయ్ దారుణం.. ఆలస్యం చేశావన్నందుకు..

ABN , Publish Date - Aug 08 , 2025 | 02:00 PM

Delivery Agent Attack: గురువారం ఆన్‌లైన్ యాప్ ‌ద్వారా ఆమె ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. డెలివరీ బాయ్ తపన్ దాస్ అలియాస్ మిటు చాలా ఆలస్యంగా ఫుడ్ తెచ్చాడు. ఆమె ఎందుకు ఆలస్యం అయిందని అడిగింది. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వివాదం మొదలైంది.

Delivery Agent Attack: ఫుడ్ డెలివరీ బాయ్ దారుణం.. ఆలస్యం చేశావన్నందుకు..
Delivery Agent Attack

ఒడిశా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ డెలివరీ బాయ్ నర్సుపై దాడి చేశాడు. ఫుడ్ డెలివరీ చేయడానికి ఎందుకు ఆలస్యం అయింది అని అడిగినందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు. పదునైన వస్తువుతో దాడి చేయటంతో నర్సు శరీరంపై పలు చోట్ల తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఆ నర్సు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటన గురువారం చోటుచేసుకుంది.


సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్‌కు చెందిన బినోదిని రత్ స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. గురువారం ఆన్‌లైన్ యాప్ ‌ద్వారా ఆమె ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. డెలివరీ బాయ్ తపన్ దాస్ అలియాస్ మిటు చాలా ఆలస్యంగా ఫుడ్ తెచ్చాడు. ఆమె ఎందుకు ఆలస్యం అయిందని అడిగింది. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే మిటు కోపం కట్టలు తెంచుకుంది. తన దగ్గర ఉన్న పదునైన వస్తువుతో బినోదినిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.


అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. మిటు దాడిలో ఆమె మెడ, తల, చేతులు, కాళ్లపై తీవ్రంగా గాయాలు అయ్యాయి. పొరిగిళ్ల వారు గాయపడ్డ ఆమెను హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మిటును అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన వస్తువును స్వాధీనం చేసుకున్నారు. దాడి సమయంలో అతడు బాగా తాగి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో బయటపడింది.


ఇవి కూడా చదవండి

ఢిల్లీ వెళ్లిన హరీష్ రావు.. న్యాయ నిపుణులతో మీటింగ్

ట్రాఫిక్ అలర్ట్.. నేడు భారీ వర్ష సూచన.. ఈ మార్గాల్లో వెళ్లారో..

Updated Date - Aug 08 , 2025 | 02:00 PM