Harish Rao Delhi Visit: ఢిల్లీ వెళ్లిన హరీష్ రావు.. న్యాయ నిపుణులతో మీటింగ్
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:26 PM
Harish Rao Delhi Visit: బీఆర్ఎస్ కీలక నేత, నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో న్యాయ నిపుణులను ఆయన కలవనున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలో చర్చించనున్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కీలక నేత, నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో న్యాయ నిపుణులను ఆయన కలవనున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలో చర్చించనున్నారు. హరీష్ రావు ఇప్పటికే పలుమార్లు కేసీఆర్‌తో ఈ విషయంపై చర్చలు జరిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయ: హరీష్
రెండు రోజుల క్రితం హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి గుండెకాయ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుప్పకూలిందంటూ కాంగ్రెస్ నేతలు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ ప్రాజెక్ట్ వల్ల పోయిన సారి లక్షల ఎకరాల్లో పంటలు పండాయని తెలిపారు. కాళేశ్వరం మూడు బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని, అలాంటప్పుడు కాళేశ్వరం మొత్తం కూలిందని ఎలా చెప్తారని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
ట్రాఫిక్ అలర్ట్.. నేడు భారీ వర్ష సూచన.. ఈ మార్గాల్లో వెళ్లారో..