Chennai: ఆమెకు చేతులెలా వచ్చాయో.. ఏం చేసిందంటే..
ABN , Publish Date - May 23 , 2025 | 12:07 PM
ఓ యువతి.. అప్పుడే పుట్టన పసికందుకు టాయిలెట్‌లో వేసి హతమార్చింది. కారణం ఏదైనా.. నవమాసాలు మోసి, పురిటినొప్పులు భరించి జన్మనిచ్చిన తల్లే.. హతమార్చడం పట్ల పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే...
- టాయిలెట్‌లో వేసి పసికందు హత్య
- యువతి అరెస్ట్
చెన్నై: టాయిలెట్‌లో వేసి పసికందును హతమార్చిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరియలూరు(Ariyaluru) జిల్లా తిరుమానూరు సమీపం కండిరాతీర్థం గ్రామానికి చెందిన లారా అనే నిండు గర్భిణి అరియలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు బుధవారం ఉదయం వచ్చింది. ఆ సమయంలో, ఆమెకు పురిటినొప్పులు రావడంతో, ఆమె వెంటనే ఆస్పత్రి ప్రాంగణలోని టాయిలెట్‌లోకి వెళ్లి తలుపు వేసుకుంది.
అక్కడ ఆడపిల్లను ప్రసవించిన లారా, పసికందును టాయిలెట్‌లో వేసి ఊపిరాడకుండా చేయగా, ఆ సమయంలో పసికందు ఏడుపుతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని టాయిలెట్ తలుపులు బద్దలుకొట్టగా, పసికందు మృతిచెంది కనిపించింది. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని, లారాను అదుపులోకి తీసుకుని, అక్రమ సంబంధంతో జన్మించడంతో పసికందును లారా హతమార్చిందా? మరేదైనా కారణముందా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
సీఎం ఓఎస్‌డీని అంటూ మెయిల్స్, కాల్స్
Read Latest Telangana News and National News