Share News

Chennai News: వివాహం జరిగి రెండున్నర నెలలే... కానీ 8 నెలల గర్భం..

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:07 PM

ఆమెకు వివాహం జరిగి కేవలం రెండున్నర నెలలో అయినా.. 8 నెలల గర్భం ఉండడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో జరిగింది. తమకు పెళ్లి జరిగి కేవలం రెండున్నర నెలలే అవుతోందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించాడు. స్థానికంగా ఈ విషయం తీవ్ర సంచలనానికి దారితీసింది. వివరాలిలా ఉన్నాయి.

Chennai News: వివాహం జరిగి రెండున్నర నెలలే... కానీ 8 నెలల గర్భం..

- పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

చెన్నై: వివాహమైన రెండున్నర నెలలకే భార్య 8 నెలల గర్భవతి అని తెలియడంతో, భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కడలూరు(Kadaluru) జిల్లా కురింజిపాడి సమీపంలోని గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతికి, వైలామూర్‌(Vylamur) గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో సెప్టెంబరు 4వ తేది వివాహమైంది. కొద్దిరోజుల క్రితం భార్య కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో, భర్త ఆమెను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు, ఆమె 8 నెలల గర్భవతి అని చెప్పడంతో భర్త దిగ్ర్భాంతి చెందాడు.


nani2.2.jpg

తన భార్య గర్భానికి కారణమైన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలంటూ ఆ భర్త నైవేలి మహిళా పోలీస్‌ స్టేషన్‌(Nyweli Woman Police Station)లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో... యువతి గర్భానికి కారణం మేనమామ అని తెలిసింది. కాగా వ్యక్తి మూడు నెలల క్రితం నైవేలీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో కోమాలో ఉండడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

సినిమాల‌కు.. ఇక సెల‌వు! నటనకు వీడ్కోలు.. పలికిన న‌టి తులసి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2025 | 01:10 PM