Share News

Chennai: ట్రిప్లికేన్‌లో బాక్సర్‌ దారుణహత్య

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:43 AM

స్థానిక ట్రిప్లికేన్‌ నియోజకవర్గం(Triplicane Constituency)లో ఓ బాక్సర్‌ను వెంటాడి బుధవారం అర్ధరాత్రి దారుణంగా హతమార్చిన కిరాయి ముఠాకు చెం దిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Chennai: ట్రిప్లికేన్‌లో బాక్సర్‌ దారుణహత్య

- కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు

చెన్నై: స్థానిక ట్రిప్లికేన్‌ నియోజకవర్గం(Triplicane Constituency)లో ఓ బాక్సర్‌ను వెంటాడి బుధవారం అర్ధరాత్రి దారుణంగా హతమార్చిన కిరాయి ముఠాకు చెం దిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు ట్రిప్లికేన్‌ కృష్ణమ్మళ్‌పేటకు చెందిన రాజేష్‌, రాధా దంపతుల కుమారుడు ధనుష్‌ (24) రాష్ట్ర, జిల్లా స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు, అతను ప్రస్తుతం పోలీసు ఉద్యోగం కోసం రాతపరీక్షకు సిద్ధమవుతున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: ‘రేలా’ లో వృద్ధుడికి అరుదైన శస్త్రచికిత్స


కొన్ని నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులకు ధనుష్(Dhanush) మధ్య సమస్య ఏర్పడినట్లు తెలిసింది. ఈ గొడవలకు సంబంధించి ధనుష్‏పై పోలీసులు కేసు కూడా పెట్టారు. దీంతో ఆయన పోలీసు శాఖ రాతపరీక్షలకు హాజరుకాలేకపోయాడు.. ఇదిలా ఉండగా బుధవారం అర్థరాత్రి ఇంటిబయట నిలబడివున్న ధనుష్‏ను గుర్తుతెలియని ముఠా మారనాయుధాలతో దాడికి యత్నించారు. వారి బారినుండి తప్పించుకునేందుకు అక్కడి నుండి పరుగుతీసిన ధను్‌షను ఆ ముఠా వెంటాడి హత్యచేసింది. అడ్డుకునేందుకు యత్నించిన ధనుష్‌ స్నేహితుడు అరుణ్‌ కూడా కిరాయి ముఠా దాడిలో తీవ్రగాయాలయ్యాయి.


nani3,2.jpg

ఇరుగుపొరుగువారు అరుణ్‌(Arun)ను ఆంబులెన్సు వాహనంలో రాయపేట(Rayapeta) ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ధనుష్‌ కుటుంబసభ్యుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఐస్‌హౌస్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదుచేసి ఈ దారుణానికి పాల్పడి పరారైన ముఠా కోసం తెల్లవార్లు పలుప్రాంతాల్లో గాలించిన పోలీసులు, ఎట్టకేలకు గురువారం ఉదయం తొమ్మిది మంది రౌడీ షీటర్లను అరెస్టు చేశారు. సైదాపేట కోర్టులో హాజరుపరచిన అనంతరం వారిని పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.


ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

Read Latest Telangana News and National News

Updated Date - Jan 31 , 2025 | 11:43 AM