Share News

Bengaluru Shocker: మహిళా డాక్టర్ హత్య కేసులో కీలక పరిణామం.. ఆమెను చంపినట్టు భర్త చివరి మెసేజ్

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:21 PM

బెంగళూరు మహిళా డాక్టర్ హత్య కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించింది. మహిళను చంపిన విషయాన్ని ఆమె భర్త స్వయంగా మరో మహిళకు మెసేజ్ చేసి చెప్పినట్టు పోలీసులు గుర్తించారు.

Bengaluru Shocker: మహిళా డాక్టర్ హత్య కేసులో కీలక పరిణామం.. ఆమెను చంపినట్టు భర్త చివరి మెసేజ్
Bengaluru Doctor Murder Case

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో కలకలం రేపిన డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృతికను ఆమె భర్త డా. మహేంద్ర రెడ్డి హత్య చేసినట్టు స్పష్టమైన ఆధారాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హత్య తరువాత అతడు ‘నీ కోసమే నేను నా భార్యను చంపా’ అని ఓ మహిళకు మెసేజ్ పంపినట్టు పోలీసులు గుర్తించారు (Bengaluru Doctor Krithika Reddy Murder case).

ఓ డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ ద్వారా మహేంద్ర రెడ్డి ఈ మెసేజ్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్‌ ఫోన్‌ను ఫారెన్సిక్ నిపుణులు తనిఖీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ కూడా మెడికల్ ప్రొఫెషన్‌లోనే ఉన్నట్టు తెలిపారు. గతంలో అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించినట్టు తెలిసింది. ఆమె స్టేట్‌మెంట్‌ను పోలీసులు ఇప్పటికే రికార్డు చేశారు. అయితే, మహిళ ఎవరనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేదు.


గతేడాది మేలో వారికి పెళ్లి జరిగింది. హత్యకు ముందు కొంతకాలంగా ఆమె అనారోగ్య కారణాల వల్ల తన పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో మహేంద్ర రెడ్డి ఏప్రిల్‌లో కృతికను హత్య చేశాడు. అంతకుముందు రెండు రోజుల పాటు ఆమె ఇంటికెళ్లి చికిత్స పేరిట ఈ ప్రొపొఫోల్ అనే అనస్థెటిక్ డ్రగ్స్‌ను ఇచ్చినట్టు తెలిసింది. ఆ తరువాత ఆమె అకస్మాత్తుగా అనారోగ్యం పాలైందంటూ సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఉందని, ట్రీట్‌మెంట్ జరుగుతోందని స్వయంగా డాక్టర్ అయిన మహేంద్ర రెడ్డి చెప్పాడు. ఈ విషయంలో కృత్రిక సోదరి అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని కోరారు.

ఇక ఫోరెన్సిక్ దర్యాప్తులో హత్య కోణం గురించి వెలుగులోకి వచ్చింది. కృతిక మృతదేహంలో ప్రొపొఫోల్ ట్రీట్‌మెంట్ గురించి బయటపడింది. అనంతరం పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఆ ఇంట్లో ఓ కాన్యులా సెట్, సూది, ఇతర మెడికల్ పరికరాలు కనిపించాయి. ఈ క్రమంలో కృతిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేంద్ర తన కూతుర్ని హత్య చేశాడని ఆరోపించారు. ఇక హత్య తరువాత మహేంద్ర తన పాత బంధాలను పునరుద్ధించుకునే ప్రయత్నం చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

సామూహిక భోజనాల్లో గొడవ.. గుడ్లు ఎక్కువగా తిన్న యువకుడి హత్య

వివాహేతర సంబంధం.. భర్త ముందే మహిళను హత్య చేసిన లవర్

Read Latest and Crime News


Updated Date - Nov 04 , 2025 | 12:29 PM